బండి సంజయ్‌పై కేసు నమోదు.. కారణం ఇదే
చెంగిచర్ల పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకుగానూ.. నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు బండి సంజయ్‌తో పాటు మరో 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

విధాత: చెంగిచర్ల పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకుగానూ.. నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు బండి సంజయ్‌తో పాటు మరో 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హోలి పండుగ సందర్భంగా చెంగిచర్లలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ వర్గానికి చెందిన వారు కొందరు తీవ్రంగా గాయపడ్డారు.
బాధితులను పరామర్శించేందుకు బుధవారం ఎంపీ బండి సంజయ్ చెంగిచర్లకు వెళ్లారు. శాంతిభద్రతల సమస్య తలెత్తే నేపథ్యంలో బండి సంజయ్ పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. బారికేడ్లు అడ్డుపెట్టి ఎక్కడిక్కకడ బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను తోసుకుని, పోలీసులను తోసేసి బండి సహా బీజేపీ కార్యకర్తలు బాధితుల నివాసాలకు చేరుకున్నారు. ఈ ఘటనపైనే పోలీసులు బండి సంజయ్ తో పాటు మరో 9 మందిపై కేసు నమోదు చేశారు.