‘కులం’.. ఈ విషయం తెలిస్తే జగపతిబాబు నచ్చేస్తాడు

విధాత‌: తెలుగులో సీనియర్ హీరోలలో నాగార్జున, జగపతిబాబు ముక్కు సూటిగా మాట్లాడుతారు. వాస్తవాన్ని ఒప్పుకుంటారు.. వైవిధ్యాన్ని కోరుకుంటారు. గతంలో ఒక చోట జగపతిబాబును తీసుకొని వెళ్లి ఇతను మనవాడే అని ఒక వ్యక్తి మరో వ్యక్తికి పరిచయం చేయగా.. ఇంతకీ ‘మనవాడు అంటే ఏమిటి అర్థం?’ అని అడిగానని.. మనవాడు అంటే మన కులం వాడు అని దానికి అర్థం అని చెప్పారని.. గతంలోనే జగపతి బాబు ఒకసారి విమర్శ చేశాడు. ఒకరు కాదు ఇద్దరిని క‌నండి.. […]

‘కులం’.. ఈ విషయం తెలిస్తే జగపతిబాబు నచ్చేస్తాడు

విధాత‌: తెలుగులో సీనియర్ హీరోలలో నాగార్జున, జగపతిబాబు ముక్కు సూటిగా మాట్లాడుతారు. వాస్తవాన్ని ఒప్పుకుంటారు.. వైవిధ్యాన్ని కోరుకుంటారు. గతంలో ఒక చోట జగపతిబాబును తీసుకొని వెళ్లి ఇతను మనవాడే అని ఒక వ్యక్తి మరో వ్యక్తికి పరిచయం చేయగా.. ఇంతకీ ‘మనవాడు అంటే ఏమిటి అర్థం?’ అని అడిగానని.. మనవాడు అంటే మన కులం వాడు అని దానికి అర్థం అని చెప్పారని.. గతంలోనే జగపతి బాబు ఒకసారి విమర్శ చేశాడు.

ఒకరు కాదు ఇద్దరిని క‌నండి..

ఇక నేటి సమాజంలో రోజురోజుకి కుల పిచ్చి పెరుగుతోంది. ఇటీవల జనాభా తగ్గించాల్సింది పోయి ఒకరిని కాదు.. ఇద్దరు ముగ్గురిని కనండి అని రాజకీయ నాయకులే తమ కులాల వారికి ప్రోత్సాహం అందిస్తున్నారు. ఎంత ఎక్కువ మంది పిల్లల్ని కంటే తమ కులం జనాభా అంతగా పెరుగుతుందని తమ పట్టు పెరుగుతుందని.. పట్టు సాధించ వచ్చనేది వారి ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇటీవల చంద్రబాబు నాయుడు కూడా ఒకరు కాదు ఇద్దరిని క‌నండి.. జ‌నాభాను పెంచండి అనే విధంగా వ్యాఖ్యానించారు.

ఎందుకు మాట్లాడ‌కూడ‌దు..?

ఇక విషయంలోకి వస్తే.. తాజాగా జగపతిబాబు కులాల ప్రస్తావన తీసుకొస్తూ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. గతంలో విజయవాడ సిద్ధార్థ కాలేజీకి వెళ్లాను. ఆ సమయంలో కులానికి వ్యతిరేకంగా మాట్లాడుతానని చెప్పాను.. అలాంటి పనులు చేయవద్దని ఆ కాలేజీ ప్రిన్సిపాల్ వేడుకున్నారు. ఎందుకు మాట్లాడకూడదని నేను అడిగితే.. కాలేజీ ఆడిటోరియంలో 2000 మంది ఉన్నారు.

వాళ్లంతా కమ్మ కుల పిచ్చోళ్ళు.. మీరు కనుక కులానికి వ్యతిరేకంగా కామెంట్ చేస్తే మీకే ప్రమాదం అని ప్రిన్సిపాల్ చెప్పినట్టు జగపతిబాబు వెల్లడించారు. ఇక ఆరోజు ప్రిన్సిపాల్ విజ్ఞప్తి మేరకు కుల ప్రస్తావన తీసుకుని రాకుండా అక్కడి నుంచి వెళ్లిపోయానని జగపతిబాబు చెప్పాడు. ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

అన్ని భాష‌ల నుంచి ఆఫ‌ర్స్‌..

ఇక జగపతిబాబు కెరీర్ విషయానికి వస్తే ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా, విలన్‌గా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పీక్ స్టేజ్‌లో ఉన్నారు. ఏయ‌న్నార్, శోభ‌న్‌బాబు, వెంక‌టేష్, నాగార్జునల‌ తర్వాత ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందిన జగపతిబాబు ఎన్నో మంచి సినిమాలలో హీరోగా నటించారు.

హీరోగా.. శుభలగ్నం, అంత:పురం, సముద్రం, గాయం వంటి అనేక చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరమయ్యాడు. మ‌ర‌లా లెజెండ్ సినిమాతో విలన్‌గా రీ ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటాడు. ప్రస్తుతం ఆయనకు అన్ని భాషల నుంచి ఆఫర్స్ వస్తుండటం విశేషమనే చెప్పుకోవాలి.