తిరుమలలో ఘనంగా శ్రీవారి చక్రస్నానం

- ధ్వజావరోహణంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు
విధాత : తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజావరోహణ ఘట్టంతో ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు మంగళవారం ఉదయం స్వామివారి చక్రస్నానం ఘట్టాన్ని శ్రీవారి పుష్కరణిలో అర్చక బృందం శాస్త్రయుక్తంగా నిర్వహించింది.

ముందుగా శ్రీవారికి, సుదర్శన చక్రతాళ్వారుకు, శ్రీదేవి, భూదేవిలకు స్నపన తిరుమంజసం చేసి, పుష్కరణీలో పవిత్ర స్నానం జరిపించారు. అనంతరం భక్తులకు పుణ్య స్నానాలకు అనుమతించారు. రాత్రి బ్రహ్మోత్సవాలలో ఆఖరి ఘట్టమై ధ్వజావరోహణ ఘట్టం నిర్వహణతో ఉత్సవాలు ముగిశాయి.