మోడీ సమావేశానికి చంద్రబాబు.. వ్యక్తిగత భేటీ ఉంటుందా!
విధాత: తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిసెంబర్ 5న ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ప్రముఖ రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నుంచి చంద్రబాబుకు ఫోన్ కాల్ వచ్చింది. జీ-20 దేశాల కూటమికి భారత్ అధ్యక్షత వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌లో త్వరలో నిర్వహించే జీ-20 భాగస్వామ్య దేశాల సదస్సుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆయాదేశాలతో ఎలాంటి […]

విధాత: తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిసెంబర్ 5న ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ప్రముఖ రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నుంచి చంద్రబాబుకు ఫోన్ కాల్ వచ్చింది.
జీ-20 దేశాల కూటమికి భారత్ అధ్యక్షత వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌లో త్వరలో నిర్వహించే జీ-20 భాగస్వామ్య దేశాల సదస్సుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆయాదేశాలతో ఎలాంటి దౌత్యసంబంధాలు కొనసాగించాలి. ఏయే వ్యూహాలు అనుసరించాలి అనే అంశాల మీద చర్చ జరుగుతుంది.
ఈ నేపథ్యంలో దేశంలోని రాజకీయ పార్టీల సూచనలు, అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం తెలుసు కోనుంది. రాష్ట్రపతి భవన్‌లో డిసెంబర్ 5న సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఆ జి-20 సదస్సును విజయవంతం చేసేందుకు వారి దగ్గర నుంచి అవసరమైన సలహాలు, సూచనలు తీసుకుంటుంది. ఇదిలా ఉండగా 2014లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసే పోటీ చేసి విజయం సాధించాయి.
నాలుగేళ్లు కలసి ఉన్న ఏ రెందుపార్టీల పొత్తు 2018లో చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు రావడంతో విచ్చిన్నం అయింది. ఆ తరువాత కేంద్రం మీద చంద్రబాబు ధ్వజం ఎత్తుతూ ధర్మపోరాట దీక్షలు చేశారు. మోడీ, అమిత్ షా వంటివారి పర్యటనలు సైతం టీడీపీ, చంద్రబాబు అవహేళన చేశారు. ఆ తరువాత 2019లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసి పరాజయం పాలయింది.
ఆ తరువాత మోడీని కలిసేందుకు చంద్రబాబు ఎంత యత్నించినా మోడీ అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు బీజేపీతో చంద్రబాబు పొత్తుకు యత్నిస్తున్నా బీజేపీ ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో మోడీ సమక్షంలో జరిగే సభకు చంద్రబాబు హాజరవడం ఆసక్తికరంగా మారింది. కేవలం సమావేశం వరకేనా, వేరేగా వ్యక్తిగతంగా కలిసి చర్చించే అవకాశం ఉందా అన్నది ఇంకా తెలియరాలేదు