Chandrababu | మోదీ.. ప్రపంచ వ్యాప్తంగా దేశానికి గుర్తింపు తెచ్చారు: తెడ్డు మర్లేసిన చంద్రబాబు
Chandrababu ప్రధానిని ప్రసన్నం చేసుకునే పనిలో ఆంద్రప్రదేశ్ మాజీ సీఎం విధాత: ఎన్డీఏ అభివృద్ధి మాకు ఎలాంటి వ్యతిరేకత లేదని, ప్రత్యేక హోదా సెంటిమెంట్ వల్లే ఎన్డీఏ నుంచి బైటికి వచ్చినట్టు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు(Chandrababu )అన్నారు. ప్రధాని మోదీ అభివృద్ధి విధానాలతో ఏకీభవిస్తున్నామన్నారు. మోదీ ప్రపంచవ్యాప్తంగా దేశానికి గుర్తింపు తెచ్చారని ఆయన వల్లే ఇవాళ ప్రపంచమంతా భారత్‌ను గుర్తిస్తున్నదన్నారు. 'టైమ్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్: ద నీడ్ టూ కీప్ ఫైటింగ్' అంశంపై సదస్సులో […]

Chandrababu
ప్రధానిని ప్రసన్నం చేసుకునే పనిలో ఆంద్రప్రదేశ్ మాజీ సీఎం
విధాత: ఎన్డీఏ అభివృద్ధి మాకు ఎలాంటి వ్యతిరేకత లేదని, ప్రత్యేక హోదా సెంటిమెంట్ వల్లే ఎన్డీఏ నుంచి బైటికి వచ్చినట్టు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు(Chandrababu )అన్నారు. ప్రధాని మోదీ అభివృద్ధి విధానాలతో ఏకీభవిస్తున్నామన్నారు. మోదీ ప్రపంచవ్యాప్తంగా దేశానికి గుర్తింపు తెచ్చారని ఆయన వల్లే ఇవాళ ప్రపంచమంతా భారత్‌ను గుర్తిస్తున్నదన్నారు.
‘టైమ్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్: ద నీడ్ టూ కీప్ ఫైటింగ్’ అంశంపై సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్న చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పీపీపీపీ-పబ్లిక్, పీపుల్, ప్రైవేట్, పార్ట్‌నర్‌షిప్ అన్నది కొత్త విధానం. టెక్నాలజీతో పేదరికాన్ని రూపు మాపవచ్చు. ఫిన్‌టెక్ దేశంలో కొత్త విప్లవాన్ని తెచ్చింది.
డిజిటల్ టెక్నాలజీ, డెమోగ్రాఫిక్ డివిడెండ్ దేశాన్ని నడిపిస్తాయి. మోదీ తెస్తున్న మార్పులు దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయని, ప్రధాని విధానాలు మెరుగుపడితే 2050 నాటికి భారత్‌దే అగ్రస్థానం అన్నారు. రూ. 500 కంటే పెద్దనోట్లన్నీ రద్దు చేయాలని ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు.
ఇటీవల టైమ్స్ నౌ సర్వేలో మళ్లీ మోడీనే ప్రధాని అని తేల్చడం, ఏపీలోని మొత్తం 25 లోక్‌సభ సీట్లలో దాదాపు 24 వరకు వైసీపీ ఖాతాలోకే వెళ్తాయని చెప్పడం టీడీపీని కలవరానికి గురిచేసి ఉండొచ్చు. సర్వేను తేలికగా తీసుకున్నట్టు బైటికి కనిపించినా.. ఇవాళ బాబు ప్రధానిపై పొగడ్తల వర్షం చూస్తే.. నారా వారు మళ్లీ స్వరం మార్చినట్టు కనిపిస్తున్నది.
దేశంలోని ఎన్డీఏ యేతర ప్రాంతీయ ప్రభుత్వాలన్నీ కేంద్రం ప్రభుత్వ విధానాలను తప్పుపడుతున్నారు. ప్రధాని మోడీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. కానీ ఏపీలో మాత్రం భిన్నపరిస్థితులు ఉన్నాయి. అక్కడ బీజేపీకి బలం లేకున్నా.. అన్నిపార్టీలు కేంద్ర ప్రభుత్వానికే జై కొట్టే పరిస్థితి నెలకొన్నది.
#NaiduAtRepublicSummit | Public, private, people, and partnership: TDP chief N Chandrababu Naidu talks about his 4P policy at #RepublicSummit2023 https://t.co/JBOJSkzT7L@ncbn | @JaiTDP | #TimeOfTransformation pic.twitter.com/fGrhUOHMO1
— Republic (@republic) April 25, 2023
అందుకే ఏపీలో సీట్లు, ఓట్లు పెద్దగా లేని బీజేపీకి అక్కడ 25 లోక్‌సభ, 11 రాజ్యసభ సీట్ల గురించి ఎన్నడూ ఆలోచించదు, ఆందోళన పడదు. ఎందుకంటే వాళ్లంతా కేంద్రం తెచ్చే అన్ని బిల్లులకు బాసటా నిలుస్తారని ఎన్డీఏ పెద్దలకు విశ్వాసం.
బలం లేని బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి లేదా ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వంలో పరోక్షంగా భాగస్వామ్యం కావడానికి సిద్ధంగా ఉన్నట్టు టీడీపీతో పాటు జనసేన అధినేత కూడా సిద్ధంగానే ఉన్నట్టు తెలుస్తోంది. వీరిద్దరి లక్ష్యం ఒక్కటే. ఏపీలో జగన్ అడ్డుకోవడానికి తాము ఎవరితో అయినా కలుస్తామనే సంకేతాలు ఇస్తుంటారు.
ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు అమరావతి రాజధానికి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోడీ చెంబెడు నీళ్లు, మట్టి తప్పా ఏమీ ఇవ్వకపోయినా.. విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయకపోయినా.. బాబు గారికి బాధ ఏమీ లేదు.
ఒకనాడు కేంద్రంలో చక్రం తిప్పానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు జగన్‌ను అడ్డుకోవడానికి ఇప్పుడు మోడీ ప్రసన్నం కోసం అనేక పాట్లు పడుతున్నారు. అందుకే ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా ఇప్పటి నుంచే ప్రధానిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డట్టు కనిపిస్తున్నది