Chiranjeevi | చిరంజీవి ఈవెంట్స్‌కి మొహం చాటేస్తున్న హీరోయిన్స్.. మొన్న నయనతార, నేడు తమన్నా.. ఎందుకిలా?
Chiranjeevi | స్వయంకృషితో ఇండస్ట్రీకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు చిరంజీవి.ఆయన తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలని ప్రేక్షకుల ముందకు తీసుకొచ్చి మంచి వినోదాన్ని పంచారు. చిరు మధ్యలో రాజకీయాలలోకి వెళ్లి ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. ఇక ఈ సినిమా నుండి చిరు నాన్‌స్టాప్‌గా సినిమాలు చేస్తున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం భోళా శంకర్. ఆగస్ట్ […]

Chiranjeevi |
స్వయంకృషితో ఇండస్ట్రీకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు చిరంజీవి.ఆయన తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలని ప్రేక్షకుల ముందకు తీసుకొచ్చి మంచి వినోదాన్ని పంచారు. చిరు మధ్యలో రాజకీయాలలోకి వెళ్లి ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. ఇక ఈ సినిమా నుండి చిరు నాన్‌స్టాప్‌గా సినిమాలు చేస్తున్నారు.
ఆయన నటించిన తాజా చిత్రం భోళా శంకర్. ఆగస్ట్ 11న ఈ చిత్రం విడుదల కానుండగా, ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గత రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా, ఈ ఈవెంట్‌కి తమన్నా డుమ్మా కొట్టింది. దీంతో చిరు సినిమాలకి హీరోయిన్స్ ఎందుకిలా డుమ్మా కొడుతున్నారనే చర్చ మొదలైంది.
సైరా సినిమాలో నయనతార కథానాయికగా నటించగా, ఆమె ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరు కాలేదు. సాధార ణంగా నయన్ ఇలాంటి ఈవెంట్స్ కి రాదు కాబటట్టి పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. ఇక ఆచార్య చిత్రంలో కాజల్ కథానాయికగా నటించగా, ఈమె ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రాలేదు. అయితే చివరి నిమిషంలో కాజల్ సీన్స్ లేపేసారు కాబట్టి ఆమె రాలేదని అందరు అనుకున్నారు.
ఆ తర్వాత చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రం చేయగా, ఇందులో శృతి హాసన్ కథానాయికగా నటించింది. ఈ అమ్మడు వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్‌కి ముందు జరిగిన వీరిసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరైంది కాని చిరు ఫంక్షన్‌కి డుమ్మా కొట్టింది. ఆ సమయంలో చిరు..శృతిపై సెటైర్స్ కూడా వేశారు. అక్కడ ఫంక్షన్‌లో ఏమి పెట్టారో, ఏం తినిందో.. తన ఆరోగ్యం బాలోదేని చెప్పిందని చిరు అన్నారు.
ఇక తాజాగా భోళా శంకర్ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కి ఇందులో కథానాయికగా నటించిన తమన్నా డుమ్మా కొట్టింది. మొన్నటి వరకు ఇక్కడే ఉన్న తమన్నా సడెన్‌గా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రాకపోవడం పట్ల అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
చిత్రంలో చిరు చెల్లెలిగా నటించిన కీర్తి సురేష్ ఈవెంట్ కి హాజరు కాగా, ఆమెపై చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. కీర్తిని ఆకాశానికి ఎత్తేశారు. ఏదేమైనా కూడా హీరోయిన్స్ ఇలా చిరుకి హ్యాండిస్తుండడం ఏ మాత్రం బాగోలేదంటూ కొందరు మెగా అభిమానులు మండి పడుతున్నారు.