ద‌ళిత మ‌హిళ‌ల అరెస్టు.. సీఎం జ‌గ‌న్ ఫ్యాక్ష‌నిజానికి ప‌రాకాష్ట‌: నారా లోకేష్‌

విధాత‌: దళితులపై దమనకాండ సాగిస్తూ, ఎస్సీ సంక్షేమ పథకాలు రద్దు చేసిన ప్రభుత్వం తీరుపై శాంతియుతంగా నిరసన తెలిపిన టీడీపీ దళిత మహిళా నేతలు అసిలేటి నిర్మల, సునీతరాణిల అరెస్ట్ సీఎం జగన్ రెడ్డి ఫ్యాక్షన్ పాలనకి పరాకాష్ట అని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ అన్నారు. సీఎం జగన్ రెడ్డి, మాజీ మంత్రి కొడాలి నాని గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లిందని ద‌ళిత మ‌హిళ‌ల‌పై పోలీసులు కేసు నమోదు చేయడం హాస్యాస్పదంగా ఉంద‌న్నారు. […]

  • By: krs    latest    Nov 19, 2022 8:11 AM IST
ద‌ళిత మ‌హిళ‌ల అరెస్టు.. సీఎం జ‌గ‌న్ ఫ్యాక్ష‌నిజానికి ప‌రాకాష్ట‌: నారా లోకేష్‌

విధాత‌: దళితులపై దమనకాండ సాగిస్తూ, ఎస్సీ సంక్షేమ పథకాలు రద్దు చేసిన ప్రభుత్వం తీరుపై శాంతియుతంగా నిరసన తెలిపిన టీడీపీ దళిత మహిళా నేతలు అసిలేటి నిర్మల, సునీతరాణిల అరెస్ట్ సీఎం జగన్ రెడ్డి ఫ్యాక్షన్ పాలనకి పరాకాష్ట అని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ అన్నారు.
సీఎం జగన్ రెడ్డి, మాజీ మంత్రి కొడాలి నాని గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లిందని ద‌ళిత మ‌హిళ‌ల‌పై పోలీసులు కేసు నమోదు చేయడం హాస్యాస్పదంగా ఉంద‌న్నారు.

32 క్రిమినల్ కేసుల్లో నిందితుడు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన హంతకుడు, సొంత బాబాయ్ ని చంపించిన దుర్మార్గుడు జగన్ రెడ్డికి, నోటితో బూతుల వాంతులు చేసుకునే కేసినో కేటు కొడాలి నానికి గౌరవ మర్యాదలు ఎక్కడున్నాయి భంగం కలగడానికి అని ప్ర‌శ్నించారు.

ఇదే చట్టం అందరికీ అమలైతే.. నాటీ సీఎం చంద్రబాబు గారిని నడిరోడ్డుపై నరికేయాలన్న ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి గారిపై ఎన్ని కేసులు పెట్టాలి? నిత్యమూ రోతకూతలు, బూతులతో ఉచ్ఛనీచాలు మరిచి ప్రతిపక్షనేతలు, ప్రజాసంఘాల నేతలను దూషించే కొడాలి నానీని ఎన్నిసార్లు అరెస్టు చేయాలి? అని అడిగారు.

అక్రమంగా అరెస్టు చేసిన టీడీపీ దళిత మహిళా నేతలను తక్షణమే విడుదదల చేయాల‌ని డిమాండ్ చేశారు. అక్రమ కేసులు ఎదుర్కొంటున్న మహిళా నేతలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంద‌ని, వాళ్ల‌కి అన్యాయం జరిగితే ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రించారు.