CM KCR | కేంద్రానికి చెప్పినా.. దున్నపోతుకు చెప్పినా ఒకటే: సీఎం కేసీఆర్‌

రైతులు ప్రకృతి వైపరీత్యాలను ధైర్యంగా ఎదుర్కొనాలి కేంద్రంతో సంబంధం లేకుండా ప్రతి ఎకరాకు పదివేల పరిహారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది-అందుకే రైతులను ఆదుకునేందుకు ముందుకు వచ్చాం దేశం మొత్తంలో ఎంత వరి పడుతుందో, తెలంగాణలో అంతకన్నా ఎక్కువే పండుతుంది వడగళ్ల ఉపద్రవం ఇంకా తొలగిపోలేదు సాగునీటి ప్రాజెక్టుల కారణంగా పెరిగిన భూగర్భ జలాలు చెట్టుకొకరు, పుట్టకొకరుగా విడిపోయిన రైతులను వెనక్కి రప్పించాం రైతులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నాం గతకాలం నాటి తిరువ బకాయిలు రద్దు చేశాం […]

  • By: Somu    latest    Mar 23, 2023 12:41 PM IST
CM KCR | కేంద్రానికి చెప్పినా.. దున్నపోతుకు చెప్పినా ఒకటే: సీఎం కేసీఆర్‌
  • రైతులు ప్రకృతి వైపరీత్యాలను ధైర్యంగా ఎదుర్కొనాలి
  • కేంద్రంతో సంబంధం లేకుండా ప్రతి ఎకరాకు పదివేల పరిహారం
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది-అందుకే రైతులను ఆదుకునేందుకు ముందుకు వచ్చాం
  • దేశం మొత్తంలో ఎంత వరి పడుతుందో, తెలంగాణలో అంతకన్నా ఎక్కువే పండుతుంది
  • వడగళ్ల ఉపద్రవం ఇంకా తొలగిపోలేదు
  • సాగునీటి ప్రాజెక్టుల కారణంగా పెరిగిన భూగర్భ జలాలు
  • చెట్టుకొకరు, పుట్టకొకరుగా విడిపోయిన రైతులను వెనక్కి రప్పించాం
  • రైతులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నాం
  • గతకాలం నాటి తిరువ బకాయిలు రద్దు చేశాం
  • కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగులో సీఎం పర్యటన
  • రామచంద్రాపూర్ గ్రామంలో నష్టపోయిన పంటల పరిశీలన

విధాత బ్యూరో, కరీంనగర్: అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులు ధైర్యం కోల్పోవద్దని.. మనసు చిన్నపుచ్చుకొని.. నారాజ్ కావద్దని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. తెలంగాణ వ్యవసాయ రంగం ఉజ్వల స్థితికి చేరుకొందని ఇది ఇలాగే ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పంట నష్టానికి సంబంధించిన నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి పంపినా ఎలాంటి ఉపయోగం ఉండదు.. కేంద్రానికి చెప్పినా.. దున్నపోతుకు చెప్పినా ఒకటే అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణలో పంట నష్టానికి సంబంధించి గతంలో రెండు, మూడు సార్లు నివేదికలు పంపినా అక్కడి నుండి నాయా పైసా రాలేదన్నారు. హైదరాబాద్ నగరానికి వరదలు సంభవించినా కేంద్రం పరిహారం ఇవ్వలేదన్నారు. భగవంతుని దయవల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది. అందుకే రైతులను ఆదుకోవాలని నిర్ణయించామన్నారు. చొప్పదండి నియోజకవర్గం రామచంద్రాపూర్ గ్రామంలో వడగళ్లతో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు.

అనంతరం మాట్లాడుతూ.. మొక్కజొన్న, వరి, మామిడి పంటలకు కేంద్రం అందించే పరిహారం నామ మాత్రమే.. అది కూడా బృందాలు రావడం.. అంచనాలు వేయడం ఓ ప్రహసనం అందుకే పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు పదివేల నష్టపరిహారం అందించాలని నిర్ణయించమన్నారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశామన్నారు.

వడగళ్లతో పంటలు కోల్పోయిన కౌలు రైతులను కూడా ఆదుకుంటామన్నారు. రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, మిర్చి, మామిడితో పాటు కూరగాయలు, పండ్ల తోటలు 84 లక్షల ఎకరాల్లో నష్టపోయినట్టు నివేదికలు అందాయన్నారు. వడగళ్ల వానలకు సంబంధించి ఇంకా ఉపద్రవం తొలగిపోలేదని ఆయన చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అనంతరం రాష్ట్రంలో ఎక్కడ చూసినా పచ్చని పైర్లే కనిపిస్తున్నాయన్నారు.

వ్యవసాయంపై నమ్మకం లేక చెట్టుకొకరు, పుట్టకొకరుగా విడిపోయిన రైతులను వెనక్కి రప్పించి వారిని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తుతో పాటు రైతు బీమా, రైతు బంధు లాంటి పథకాలను అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. గతంలో ఉన్న నీటి తీరువ బకాయిలు కూడా రద్దు చేశామన్నారు. జలయజ్ఞం ఫలితంగా రాష్ట్రంలో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నాయన్నారు.

ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఒక పంట దెబ్బతిన్నా, తిరిగి బ్రహ్మాండంగా పంటలు పండించుకునే అవకాశం ఉందన్నారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా వ్యవసాయ రంగానికి అనేక వసతులు కల్పించామన్నారు. కష్టకాలంలో రైతులు నిలబడాలని, ప్రకృతి వైపరీత్యాలను ధైర్యంగా ఎదుర్కొనాలని పిలుపునిచ్చారు. పంట నష్టం పరిహారం నెలల తరబడి జాప్యం లేకుండా తక్షణం చెల్లిస్తామన్నారు. దేశం మొత్తం మీద ఎంత వరి పండుతుందో, తెలంగాణలో అంతకన్నా ఎక్కువ వారి పండుతుందన్నారు.