CM KCR | ధరణితో రాబంధులు, పైరవీకారులు లేకుండా పోయారు: సీఎం కేసీఆర్
ధరణిని తీసి వేస్తామన్న వారికి బుద్ది చెప్పండి ధరణితో హైదరాబాద్లో డబ్బులు వేస్తే నేరుగా మీఖాతాల్లోకి వస్తున్నాయి గద్వాల పర్యటనలో సీఎం కేసీఆర్ విధాత: ధరణి వచ్చిన తరువాత రాబంధులు, పైరవీ కారులు లేకుండా పోయారని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. సోమవారం గద్వాల జిల్లా పర్యటనకు వెళ్లిన ఆయన సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలతో పాటు జిలా బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆతరువాత నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ ఇప్పుడు కొందరు దళారీలు […]

- ధరణిని తీసి వేస్తామన్న వారికి బుద్ది చెప్పండి
- ధరణితో హైదరాబాద్లో డబ్బులు వేస్తే నేరుగా మీఖాతాల్లోకి వస్తున్నాయి
- గద్వాల పర్యటనలో సీఎం కేసీఆర్
విధాత: ధరణి వచ్చిన తరువాత రాబంధులు, పైరవీ కారులు లేకుండా పోయారని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. సోమవారం గద్వాల జిల్లా పర్యటనకు వెళ్లిన ఆయన సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలతో పాటు జిలా బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆతరువాత నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ ఇప్పుడు కొందరు దళారీలు మోపై ధరణిని తీసివేసి బంగాళాఖాతంలో వేస్తామంటున్నారన్నారు.
ధరణి ఉండాలో వద్దో ప్రజలే తేల్చుకోవాలన్నారు. ధరణి ఉంది కాబట్టి రాబంధులు, పైరవీకారులు, పట్వారీలు, వీఆర్వోలు లేరన్నారు. ధరణి వచ్చిన తరువాత పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ అవుతుందని, ఐదు నిమిషాల్లో పట్టా అయిపోతుందన్నారు. గతంలో రిజిస్ర్టేషన్కు, పట్టాకు ఎన్ని రోజులో పట్టేదని, వాళ్ల దయ మీద ఆధారపడి ఉండేదన్నారు. వాళ్లు రాసింది లెక్క.. వారు గీసింది గీత అన్నట్లుగా ఉండేదని సీఎం అన్నారు.
ఇంత మంచి సదుపాయాన్ని మూడు సంవత్సరాలు కష్టపడి పని చేసి ప్రజల కోసం తీసుకువస్తే.. కాంగ్రెస్ పార్టీ ధరణిని తీసి బంగాళాఖాతంలో విసిరి వేస్తామంటుందన్నారు. ఇది ధరణిని వేయడమా? ప్రజలను బంగాళాఖాతంలో వేయడమా?’ అంటూ సీఎం ప్రశ్నించారు. మీతోపాటు ‘ఆదిలాబాద్, కరీంనగర్, నిర్మల్లో ప్రజలు ధరణి ఉండాలని చెబుతున్నారని, ధరణిని తీసివేస్తామన్న వారికి ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు.
హైదరాబాద్‌లో డబ్బులు వేస్తే నేరుగా మీ ఖాతాల్లోకే
తాను ధరణితో డబ్బులను హైదరాబాద్‌లో వేస్తే.. నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లో జమవుతున్నాయని సీఎం తెలిపారు. ఎవరైనా రైతుచనిపోతే రూ.5లక్షలు పది రోజుల్లో వారి బ్యాంకుల్లో పడుతున్నయన్నారు. గతంలో రైతులు వడ్లు అమ్మితే.. పైసలు వచ్చేందుకు నెలలు పట్టేదని, ఇప్పుడు ప్రభుత్వం గ్రామాల్లోనే కొనుగోలు చేస్తుందన్నారు.
దీంతో పైసలు నేరుగా వచ్చి బ్యాంకుల్లో పడుతున్నయని తెలిపారు. గతంలో ఎండిపోయి, ఇబ్బందిపడ్డ పాలమూరు ఇప్పుడు కళకళలాడుతోందన్నారు. కరెంటు, రైతుబంధు, దళితబంధు రావాలంటే బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలన్నారు.
Live: BRS President, CM Sri KCR addressing a Public Meeting in Gadwal https://t.co/9z0QnPfQjW
— BRS Party (@BRSparty) June 12, 2023
గద్వాలకు నిధులు
గద్వాల జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు,12 మండలాలు, నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయని, తొలిసారిగా ఇక్కడి వచ్చిన తాను అభివృద్ధి చేసుకోవడానికి గ్రామ పంచాయతీలకు రూ. 10 లక్షలు, మండల కేంద్రానికి రూ. 15 లక్షలు, గద్వాల మున్సిపాలిటీకీ రూ. 50 కోట్లు, మిగిలిన మూడు మున్సిపాలిటీలకు రూ. 25 కోట్ల చొప్పున ప్రత్యేక గ్రాంట్ మంజూరు చేస్తున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ నిధులతో బాగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. గట్టు ఎత్తిపోతల పథకాన్ని, అలంపూర్లో ఆర్డీఎస్కు కొనసాగింపుగా ఉన్న మల్లమ్మ కుంట పథకాన్ని వీలైనంత తొందరలో పూర్తి చేస్తామన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రలు తెలంగాణ ఉద్యమకారులేనన్నారు. నిరంజన్ రెడ్డి ఫీల్డ్ మీద, శ్రీనివాస్ గౌడ్ టీజీవో అధ్యశ్క్షుడిగా ఉంటూ ఉద్యోగాన్ని లెక్క చేయకుండా ఉద్యమం చేశారన్నారు. లక్ష్మా రెడ్డి కూడా ఉద్యమంలో పని చేశారన్నారు. ఉచిత కరెంట్ ఇస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నామన్నారు.
కేసీఆర్ కన్నా దొడ్డుగా, ఎత్తుగా ఉన్నోళ్లు మంత్రులు అయ్యారని, వారి కాలంలో ఏం జరిగిందని ప్రశ్నించారు. గతంలో బతుకు లేక మనం వలసపోయామని, ఇవాళ కర్నూల్, రాయిచూర్ నుంచి మన వద్దకు వలస వస్తున్నారన్నారు. తెలంగాణ ఏర్పడితే కరెంట్ రాదని మాట్లాడారని, తుంగభద్ర బ్రిడ్జి దాటితే 24 గంటల కరెంట్ లేదన్నారు