ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓటు వేసిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి జూపల్లి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు గురువారం జరిగిన పోలింగ్‌లో కొడంగల్ ఎంపీడీవో కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • By: Somu    latest    Mar 28, 2024 11:06 AM IST
ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓటు వేసిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి జూపల్లి

విధాత : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు గురువారం జరిగిన పోలింగ్‌లో కొడంగల్ ఎంపీడీవో కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కేంద్రంలో మొత్తం 56మంది ఓటర్లుగా ఉన్నారు. అటు మంత్రి జూపల్లి సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 1439మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటర్లుగా ఉండగా, 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.


కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్‌రెడ్డి, బీఆరెస్ నుంచి నవీన్‌కుమార్‌రెడ్డి, ఇండిపెండెంట్‌గా సుదర్శన్‌రెడ్డిలు బరిలో ఉన్నారు. పోలింగ్ ప్రక్రయ సాయంత్రం 4గంటలతో ముగిసింది. ఏప్రిల్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా పెద్ద ఎత్తున బీఆరెస్ నుంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌లో చేరినప్పటికి సంఖ్యాపరంగా బీఆరెస్‌కు మెజార్టీ కనిపిస్తుంది. ఈ ఎన్నికల ఫలితాల్లో క్రాస్ ఓటింగ్ కీలకంగా మారనుంది అంచనా వేస్తున్నారు.