వణికిస్తున్న చలి.. అప్రమత్తంగా ఉండాలంటున్న డాక్టర్లు
విధాత: తెలంగాణను చలి వణికిస్తుంది. సాధారణం కంటే నాలుగైదు డిగ్రీల ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సాధారణంగా నవంబర్ రెండో వారంలో మన రాష్ట్రంలో చలి ప్రారంభం అవుతది. కానీ ఈ ఏడు మూడు వారాల ముందుగానే చలి ప్రారంభమైంది. గత నాలుగు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో చలి తీవ్రత బాగా పెరిగిందని నిపుణులు పేర్కొన్నారు. చలి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ శివారులోని హకీంపేటలో గాలిలో తేమ సాధారణంగా […]

విధాత: తెలంగాణను చలి వణికిస్తుంది. సాధారణం కంటే నాలుగైదు డిగ్రీల ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సాధారణంగా నవంబర్ రెండో వారంలో మన రాష్ట్రంలో చలి ప్రారంభం అవుతది. కానీ ఈ ఏడు మూడు వారాల ముందుగానే చలి ప్రారంభమైంది. గత నాలుగు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో చలి తీవ్రత బాగా పెరిగిందని నిపుణులు పేర్కొన్నారు. చలి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్ శివారులోని హకీంపేటలో గాలిలో తేమ సాధారణంగా 73 శాతం ఉండాలి కానీ 54 శాతానికి , నల్లగొండలో 21 శాతానికి పడిపోయింది. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లోను బుధవారం అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అలెర్టుగా ఉండాలి. శ్వాసకోస నాళాలు కుచించుకుపోయి గాలి తీసుకోవడం కష్టంగా మారుతుంది. జలుబు, గొంతునొప్పి, నిమోనియా, ఆస్తమా లాంటి వ్యాధులు తీవ్రం అవుతాయి. వైరస్‌లు తేలిగ్గా వ్యాపించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవడం మంచిది.
శరీరంలో కూడా నీటి శాతం తగ్గిపోతుంది. తద్వారా చర్మం పొడి బారిపోతుంది. కాళ్లల్లో పగుళ్లు ఏర్పడి దురదలొస్తాయి. పొడి బారే సమస్యను నివారించడానికి చర్మంపై తేమను పెంచే లేపనాలు రాయాలి. కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ రాస్తే చర్మాన్ని కాపాడుకోవచ్చు.