Allu Ramesh | తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం.. కమెడియన్ అల్లు రమేశ్ కన్నుమూత
Allu Ramesh | విధాత: తెలుగు సినిమా పరిశ్రమలో మరో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ప్రముఖ రంగస్థల నటుడు, హాస్యనటుడు అల్లు రమేశ్ మృతి చెందాడు. హార్ట్ ఫేయిల్యూర్‌తో అల్లు రమేశ్ మృతి చెందినట్లు ఆయన కుటుంబీకులు తెలిపారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు, రంగస్థల నటులు సంతాపం తెలిపారు. అల్లు రమేశ్ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌ల్లోనూ నటించారు. వైజాగ్‌కు చెందిన అల్లు రమేశ్ నాటక రంగం నుంచి చిత్ర సినిమాలోకి […]

Allu Ramesh |
విధాత: తెలుగు సినిమా పరిశ్రమలో మరో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ప్రముఖ రంగస్థల నటుడు, హాస్యనటుడు అల్లు రమేశ్ మృతి చెందాడు. హార్ట్ ఫేయిల్యూర్‌తో అల్లు రమేశ్ మృతి చెందినట్లు ఆయన కుటుంబీకులు తెలిపారు.
ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు, రంగస్థల నటులు సంతాపం తెలిపారు. అల్లు రమేశ్ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌ల్లోనూ నటించారు. వైజాగ్‌కు చెందిన అల్లు రమేశ్ నాటక రంగం నుంచి చిత్ర సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు.
ఆయన తొలిసారి ‘సిరిజల్లు’ చిత్రంలో నటించారు. ఈ సినిమాలో నలుగురు హీరోల్లో ఆయన ఒకరు. ‘నెపోలియన్’ సినిమా ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది.
చివరగా రమేశ్ ‘కేరింతలు’ అనే సినిమాలో కనిపించారు. ప్రస్తుతం ఆయన ‘మా విడాకులు’ వెబ్ సిరీస్ నటించారు. యూట్యూబ్‌లో ఈ వెబ్ సిరీస్ దూసుకుపోతున్నది. ఇందులో ఆయన పోషించిన మామ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.