Congress Party | అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం: మాణిక్ రావు థాక్రే

రేవంత్ రెడ్డి పాదయాత్ర సక్సెస్ దాడికి గురైన పవన్ కు పరామర్శ రామప్ప దేవాలయం అద్భుతం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: Congress Party | కాంగ్రెస్ పార్టీ తెలంగాణ (Telangana)లో అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు థాక్రే(Manik Rao Thackeray) అన్నారు. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకు రావడానికి సిద్దంగా ఉన్నారని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ థాక్రే […]

Congress Party | అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం: మాణిక్ రావు థాక్రే
  • రేవంత్ రెడ్డి పాదయాత్ర సక్సెస్
  • దాడికి గురైన పవన్ కు పరామర్శ
  • రామప్ప దేవాలయం అద్భుతం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: Congress Party | కాంగ్రెస్ పార్టీ తెలంగాణ (Telangana)లో అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు థాక్రే(Manik Rao Thackeray) అన్నారు. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకు రావడానికి సిద్దంగా ఉన్నారని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ థాక్రే ధీమా వ్యక్తం చేశారు.

ఉమ్మడి వరంగల్(Warangal) జిల్లాలో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా హనుమకొండ (Hanumakonda), రామప్పలలో మీడియాతో మాట్లాడారు. స్వయంపాలనతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, బడుగు బలహీన వర్గాలు బాగు పడుతారు అని సోనియా(Sonia) ఆశించినా, ఇక్కడ కల్వకుంట్ల (Kalvakuntla) కుటంబం మాత్రమే అభివృద్ధి చెందిందన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా కేసీఆర్(KCR), నరేంద్ర మోడీ (Narendra Modi)తో ఢిల్లీలో దోస్తీ గల్లిలో కుస్తీ పడుతూ మభ్యపెడుతున్నారని విమర్శించారు. బీజేపీ (BRS), బీఆర్ఎస్ (BRS) పార్టీ రెండు ఒకటేనని మండిపడ్డారు. డబ్బు, పోలీసుల సహకారంతో పరిపాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేపట్టిన హత్ సే హత్ యాత్ర (Hat Se Hat Yatra) విజయవంతం అవుతుందని థాక్రే చెప్పారు. పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని అన్నారు.

తోట పవన్(Thota Pawan)ను పరామర్శించిన థాక్రే

బీఆర్ఎస్ గుండాల దాడిలో తీవ్రంగా గాయపడిన కాంగ్రెస్ నాయకుడు తోట పవన్‌ (Thota Pawan)ను థాక్రే పరామర్శించారు. పవన్‌ను హనుమకొండ అడ్వకేట్స్ కాలనీలోని ఇంట్లో పరామర్శించారు. పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పవన్ పై దాడి చేయడాన్ని ఖండించారు. ఆయనను చంపాలనే లక్ష్యంతోనే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం కార్యకర్తలకు అండగా ఉంటుందన్నారు.

రామప్ప(Ramappa)ను సందర్శించిన థాక్రే

రామప్ప (Ramappa) దేవాలయంలో రామలింగేశ్వర స్వామి (Ramalingeshwar Swami)ని థాక్రే దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామప్ప శిల్ప సంపద అమోఘం, అద్భుతం అన్నారు.
కాకతీయుల (Kakatiyas) కళా వైభవం కళ్ళకు కట్టినట్లు ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి (AICC Secretary Rohit Chaudhary), హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy), ఎమ్మెల్యే సీతక్క (MLA Sitakka), కాంగ్రెస్ నేతలు పోరిక బలరాం నాయక్, సంభాని చంద్ర శేఖర్, సిరిసిల్ల రాజయ్య, కొండ మురళి, ఈ.వి శ్రీనివాస్ తదితర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.