Harish Rao | కాంగ్రెస్‌కు లీడర్లు లేరు.. బీజేపీకి క్యాడర్ లేదు: మంత్రి హరీష్ రావు
Harish Rao | బీఆర్ఎస్ కు తిరుగులేదు.. కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు అమ్ముతుంది.. రేపు రాష్ట్రాన్ని అమ్ముతారు.. రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి లీడర్లు లేరు, బీజేపీకి క్యాడర్ లేదు.. బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఎంపీ కొత్త ప్రభాకర్ […]

Harish Rao |
- బీఆర్ఎస్ కు తిరుగులేదు..
- కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు అమ్ముతుంది..
- రేపు రాష్ట్రాన్ని అమ్ముతారు..
- రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి లీడర్లు లేరు, బీజేపీకి క్యాడర్ లేదు.. బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తో కలసి మంత్రి మీడియాతో మాట్లాడారు.
ఈనెల 23 న సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో సమీకృత కలెక్టరేట్, పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం, బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాలు ప్రారంభించడానికి వస్తున్నారని చెప్పారు. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం బహిరంగ సభలో పాల్గొంటారన్నారు.
మెదక్ జిల్లాను సహకారం చేసి, కలెక్టరేట్ ఏర్పాటు చేసి, మెడికల్ కాలేజ్ మంజూరు చేసిన సీఎం ఇక్కడికి రావడం సంతోషకరమన్నారు. కేసీఆర్ గారు 33 జిల్లాలు ఏర్పాటు చేసి, జిల్లా కలెక్టరేట్లను అద్భుతంగా నిర్మించారని అన్నారు. మా రాష్ట్రాల్లో సచివాలయం కంటే మీ కలెక్టరేట్లు బాగున్నాయి అని ఇతర రాష్ట్రాల నాయకులు అంటున్నారని తెలిపారు.
మెదక్ జిల్లా ఏర్పాటు ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ, మెదక్ రైలు తేవడం ఎన్నో ఏళ్ల కల అన్నారు. ఎంతోమంది హామీలు ఇచ్చారు గాని ఎవరూ నెరవేర్చలేదని, ప్రధానమంత్రిగా, మెదక్ ఎంపీగా ఉండి కూడా ఇందిరా గాంధీ గారు ఉండి నెరవేర్చలేకపోయారని తెలిపారు. కాంగ్రెస్ మాట తప్పినా, మెదక్ జిల్లా ప్రజల కలలు సీఎం కేసీఆర్ గారు నెరవేర్చారనీ మంత్రి హరీష్ పేర్కొన్నారు.
మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ అన్నారు. 35 నుంచి 40 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు వారికి నాయకులే లేరనీ మంత్రి ఎద్దేవా చేశారు. ఫీజులు వసూలు చేస్తూ దరఖాస్తులు అమ్ముకుంటున్నారనీ మంత్రి ఆరోపించారు.
అభ్యర్థుల దరఖాస్తులు అమ్ముకున్న పార్టీ.. రేపు రాష్ట్రాన్ని కూడా అమ్ముతుందనీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో చెప్పింది ఒకటి, చేసేది ఒకటని, అక్కడ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారనీ చెప్పారు.బిజెపి వాళ్లది డిపాజిట్ల కోసం తండ్లడే పరిస్థితి అని, ఎవరెన్ని ట్రిక్కులు చేసినా బీఆరెస్ హ్యాట్రిక్ కొట్టబోతున్నదని మంత్రి అన్నారు. పోయిన సారికంటే ఎక్కువ సీట్లు సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, బక్కి వెంకటయ్య పాల్గొన్నారు
మంత్రి హరీష్ సమక్షంలో చేరికలు
మెదక్ మాజీ జడ్పీటీసీ కిషన్ గౌడ్, మాజీ కౌన్సిలర్ చంద్రకళ …. మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. గతం లోనే టి డి పి నుండి టి అర్ ఎస్ లో చేరిన ఆయన, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తో సఖ్యత లేక కొంత కాలంగా దూరంగా ఉన్నారు. గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుంటే చంద్రకళ బీజేపీ లో చేరి కౌన్సిలర్ గా పోటీ చేసిఓడిపోయారు. మళ్ళీ మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.