ప్రగతి భవన్‌కు కాంగ్రెస్ నేతలు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, జడ్పీ ఛైర్పర్సన్ విజయలక్ష్మి
విధాత: చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మంచిర్యాల జడ్పీ ఛైర్పర్సన్ విజయలక్ష్మి ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. నల్లాల ఓదెలు, విజయలక్ష్మి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.కేసీఆర్ నేడు జాతీయ పార్టీని ప్రకటించబోతున్న నేపథ్యంలో వారు ఇరువురు ప్రగతి భవన్‌కు రావడం చర్చనీయాంశమైంది. ఆ మధ్య కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నిక మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ టీఆర్ఎస్ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత కేసీఆర్‌ను కలిసి పార్టీలోనే కొనసాగుతున్నారు. గత ఎన్నికల సమయంలో […]

విధాత: చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మంచిర్యాల జడ్పీ ఛైర్పర్సన్ విజయలక్ష్మి ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. నల్లాల ఓదెలు, విజయలక్ష్మి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
కేసీఆర్ నేడు జాతీయ పార్టీని ప్రకటించబోతున్న నేపథ్యంలో వారు ఇరువురు ప్రగతి భవన్‌కు రావడం చర్చనీయాంశమైంది.
ఆ మధ్య కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నిక మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ టీఆర్ఎస్ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత కేసీఆర్‌ను కలిసి పార్టీలోనే కొనసాగుతున్నారు.
గత ఎన్నికల సమయంలో చెన్నూరు టికెట్ తనకు కాదని బాల్క సుమన్‌కు కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన నల్లాల ఓదెలు కొంతకాలం పార్టీ కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్టే ఉండి చివరికి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేసీఆర్ జాతీయ ప్రకటన సమయంలో ప్రగతి భవన్‌కు ఆయన రావడంతో వాళ్లే వచ్చారా? లేక టీఆర్ఎస్ అధిష్ఠాన వర్గం పిలిపించిందా? అని చర్చ జరుగుతున్నది.