తెలంగాణలో కాంగ్రెస్ హవా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 67స్థానాల్లో ఆధిక్యత కొనసాగుతుండగా, బీఆరెస్ 39, బీజేపీ 8 స్థానాల్లో, ఎంఐఎం 4స్థానాల్లో, బీఎస్పీ 1 స్థానంలో ఆధిక్యత కొనసాగుతుంది

- కేసీఆర్, ఈటల, బండి వెనుకంజ..రేవంత్ రెండుచోట్ల ముందంజ
- అశ్వారావు పేట కాంగ్రెస్ బోణి
విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 67స్థానాల్లో ఆధిక్యత కొనసాగుతుండగా, బీఆరెస్ 39, బీజేపీ 8 స్థానాల్లో, ఎంఐఎం 4స్థానాల్లో, బీఎస్పీ 1 స్థానంలో ఆధిక్యత కొనసాగుతుంది. సీఎం కేసీఆర్ కామారెడ్డిలో మూడోస్థానంతో వెనుకబడగా, గజ్వేల్‌లో ఆధిక్యతలో ఉన్నారు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అటు కామారెడ్డి, ఇటు కొడంగల్‌లో లీడ్‌లో ఉన్నారు. బీజేపీ నేత ఈటల రాజేందర్ హుజూరాబాద్, గజ్వేల్‌లలో వెనుకంజలో ఉన్నారు. కరీంనగర్లో బండి సంజయ్ వెనుకంజలో ఉన్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ నాగేశ్వర్రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి ప్రభృతులు వెనుకంజలో ఉన్నారు. ఫలితాలు వెలువడిన తొలి స్థానం అశ్వారావు పేటలో కాంగ్రెస్ అభ్యర్ధి ఆది నారాయణ 28వేల ఓట్లతో విజయం సాధించారు.
కాంగ్రెస్ సీనియర్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్, రాజగోపాల్‌రెడ్డిలు, భట్టి విక్రమార్క, పొంగులేటి, తుమ్మలలతో పాటు తొలిసారి పోటీ చేసిన కుందూరు జయవీర్‌రెడ్డి, యశస్వినిరెడ్డిలు విజయం దిశగా దూసుకెలుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11స్థానాల్లో కాంగ్రెస్, సూర్యాపేటలో బీఆరెస్, ఖమ్మంలో మొత్తం 10స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యతలో ఉంది.