Congress | రాజ్ భ‌వ‌న్ ముట్టడికి కాంగ్రెస్ యత్నం.. ఉద్రిక్త‌త‌

రాజ్ భ‌వ‌న్ వ‌ద్ద‌ ఉద్రిక‌త్త‌ మోడీ, అదానీ బావ‌బామ్మ‌దులు అదానీని కుంబకోణాలపై విచారణ చేయాలని డిమాండ్‌ కాంగ్రెస్ ర్యాలీతో పోలీనులు అప్ర‌మ‌త్తం రాజ్ భ‌వ‌న్ రోడ్డు మూసివేత‌ రాజ్ భ‌వ‌న్ వ‌ద్ద భట్టి విక్రమార్క అరెస్ట్‌ విధాత: అదానీ (Adani) కుంబకోణాలపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) వేసి విచారణ చేయాలని కాంగ్రెస్‌ (Congress) డిమాండ్‌ చేసింది. ఏఐసీసీ (AICC) ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున బుధవారం రాజ్‌భవన్‌ (Raj […]

Congress | రాజ్ భ‌వ‌న్ ముట్టడికి కాంగ్రెస్ యత్నం.. ఉద్రిక్త‌త‌
  • రాజ్ భ‌వ‌న్ వ‌ద్ద‌ ఉద్రిక‌త్త‌
  • మోడీ, అదానీ బావ‌బామ్మ‌దులు
  • అదానీని కుంబకోణాలపై విచారణ చేయాలని డిమాండ్‌
  • కాంగ్రెస్ ర్యాలీతో పోలీనులు అప్ర‌మ‌త్తం
  • రాజ్ భ‌వ‌న్ రోడ్డు మూసివేత‌
  • రాజ్ భ‌వ‌న్ వ‌ద్ద భట్టి విక్రమార్క అరెస్ట్‌

విధాత: అదానీ (Adani) కుంబకోణాలపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) వేసి విచారణ చేయాలని కాంగ్రెస్‌ (Congress) డిమాండ్‌ చేసింది. ఏఐసీసీ (AICC) ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున బుధవారం రాజ్‌భవన్‌ (Raj Bhavan) ముట్టడికి గాంధీ భవన్‌ నుంచి ఊరేగింపుగా బయలు దేరి వెళ్లారు. మోడీ, అదానీల సంబంధం ఏమిటో బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. అదానీ అక్రమాలు, కుంబకోణాలపై విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు.

రాజ్‌భవన్‌ ముట్టడి కార్యక్రమానికి సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) నాయకత్వం వహించగా, ఎమ్మెల్ల్యే సీతక్క, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరీ, చిన్నారెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, నాయకులు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, సంగిశెట్టి జగదీష్, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల ఛైర్మన్ లు, పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతూ.. దేశంలో ప్రధాని మోడీ ఆదానీకి దేశ సంపద దోచి పెట్టారని ఆరోపించారు. అదానీ అక్రమాలకు పాల్పడడం, పెద్ద ఎత్తున చేసిన కుంబకోణం అంశాలతో పాటు. అదాని షేర్ల పతనం తదితర అంశాలపై పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. క్రోని కాపాటలిజం కు వ్యతిరేకంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు టీపీసీసీ ఆద్వర్యంలో చలో రాజభవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఖైరతాబాద్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

  • రాజ్ భవన్ వైపు దూసుకెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు

ఛ‌లో రాజ్ భవన్‌కి బయలుదేరిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఖైరతాబాద్ చౌరస్తా వద్ద అరెస్టు చేసిన పోలీసులు, ఖైరతాబాద్ నుంచి గోషా మాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఏఐసీసీ సెక్రెటరీ నదీమ్ జావిద్ రోహిత్ చౌదరి పీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షులు రోహిన్ రెడ్డి, నాయకులు చామల కిరణ్ రెడ్డి, అనిల్ యాదవ్, వెంకట్, శివసేనారెడ్డి తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాజ్ భవన్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. రాజ్ భవన్ వైపు వెళ్లే రోడ్లను పోలీసులు మూసివేశారు.