Congress | ఔను వాళ్లిద్దరు ఒకటయ్యారు..! రేవంత్, కోమటిరెడ్డి మధ్య కుదిరిన సయోధ్య
Congress జూపల్లిని పార్టీలోకి ఆహ్వానించేందుకు… కోమటిరెడ్డి ఇంటికి వెళ్లిన పీసీసీ చీఫ్ ఇద్దరు కలిసి వెళ్లి జూపల్లితో కలిసి భోజనం విరోదుల కలయికతో కాంగ్రెస్ శ్రేణుల్లో నయాజోష్ విధాత, హైదరాబాద్ ప్రతినిధి: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి, ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియామకం జరిగిన నాటి నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రేవంత్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు […]

Congress
- జూపల్లిని పార్టీలోకి ఆహ్వానించేందుకు…
- కోమటిరెడ్డి ఇంటికి వెళ్లిన పీసీసీ చీఫ్
- ఇద్దరు కలిసి వెళ్లి జూపల్లితో కలిసి భోజనం
- విరోదుల కలయికతో కాంగ్రెస్ శ్రేణుల్లో నయాజోష్
విధాత, హైదరాబాద్ ప్రతినిధి: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి, ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియామకం జరిగిన నాటి నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రేవంత్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అదేస్థాయిలో రేవంత్ అండ్ టీం కూడా కోవర్టు కోమటిరెడ్డి అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఒకరినొకరు బండ బూతులు తిట్టుకున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో బద్దవిరోధులుగా ఆ ఇద్దరు నాయకులపై ముద్ర పడింది. కానీ ఇదంత కొద్ది రోజుల కిందటి మాట. ఇప్పుడు వాళ్లిద్దరి మధ్య సయోధ్య కుదిరింది. అది ఎంతలా అంటే ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి పలకరించుకునేంత దగ్గరయ్యారు. ఔను వాళ్లిద్దరు ఒకటయ్యారు.
బుధవారం ఉదయం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును పార్టీలోకి ఆహ్వానించేందుకు బయలుదేరిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మొదట కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. అనంతరం ఇద్దరు కలిసి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. అక్కడ జూపల్లి కృష్ణారావుతో పాటు ఆయన అనుచరులతో మాట్లాడిన రేవంత్, కోమటిరెడ్డి అందరిని కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.
జూపల్లి, తదితర కాంగ్రెస్ నాయకులతో కలిసి ఒకే టేబుల్‌పై భోజనం చేసిన రేవంత్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్లీ ఇద్దరు కలిసి పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ని కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. కాంగ్రెస్‌లో నువ్వా నేనా అన్నట్లుగా ఉన్న రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి ఒక్కసారిగా ఇప్పుడు నువ్వు లేక నేను లేను అన్నట్లుగా కలిసి పోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నయా జోష్ వచ్చినట్లైంది. మరి ఈ సయోధ్య ఎన్నాళ్లు ఉంటుంది అనేది స్పష్టంగా చెప్పలేము కానీ.. ఇది కాంగ్రెస్‌కు కలిసి వచ్చే మైత్రి అని మాత్రం చెప్పవచ్చును.