మద్యం మత్తులో.. నడిరోడ్డుపై బట్టలు విప్పి కానిస్టేబుల్ వీరంగం..!
విధాత: పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఓ కానిస్టేబుల్.. తన విధులను మరిచి అసభ్యంగా ప్రవర్తించాడు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై బట్టలు విప్పి.. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించాడు. పీకల దాకా మద్యం సేవించిన ఆ కానిస్టేబుల్.. మరో వ్యక్తితో గొడవ పడి ఈ చర్యకు పాల్పడ్డాడు. అసభ్యంగా ప్రవర్తించిన ఆ కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాకు చెందిన సుశీల్ మాండవి అనే వ్యక్తి పోలీసు కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే శుక్రవారం […]

విధాత: పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఓ కానిస్టేబుల్.. తన విధులను మరిచి అసభ్యంగా ప్రవర్తించాడు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై బట్టలు విప్పి.. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించాడు. పీకల దాకా మద్యం సేవించిన ఆ కానిస్టేబుల్.. మరో వ్యక్తితో గొడవ పడి ఈ చర్యకు పాల్పడ్డాడు. అసభ్యంగా ప్రవర్తించిన ఆ కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాకు చెందిన సుశీల్ మాండవి అనే వ్యక్తి పోలీసు కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే శుక్రవారం సాయంత్రం పీకల దాకా మాండవి మద్యం సేవించాడు. రోడ్డుపై వెళ్తూ అర్ధనగ్నంగా ఉన్న మరో వ్యక్తితో గొడవపడ్డాడు. దీంతో వారిద్దరి చుట్టూ స్థానికులు గుమిగూడారు.
ఇక కానిస్టేబుల్, మరో వ్యక్తి వాగ్వాదం తారా స్థాయికి చేరింది. దీంతో కానిస్టేబుల్ తన షర్ట్, ప్యాంట్ విప్పేశాడు. వాటిని స్థానికుల పైకి విసిరేసి నడిరోడ్డుపై కూర్చున్నాడు. కానిస్టేబుల్ తతాంగాన్ని స్థానికులు చిత్రీకరించి, సోషల్ మీడియాలో వైరల్ చేశారు. హర్దా జిల్లా ఎస్పీ మనీశ్ కుమార్ అగర్వాల్ సీరియస్‌గా స్పందించారు. కానిస్టేబుల్ మాండవిని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.