కాంగ్రెస్‌లోనే ఉంటాం.. వచ్చే ఎన్నికల్లో తూర్పు నుంచి పోటీ: మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి
గులాబీ పార్టీ భూకబ్జాదారులమయం.. గోపాలపురం కబ్జాలో 'వినయ్' హస్తం మేము నిఖార్సైన కాంగ్రెస్ వాదులం రేవంత్ హాత్‌సే హాత్‌జోడో యాత్రలో పాల్గొంటాం 9 నుంచి తూర్పులో గడపగడపకు: మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అధికార గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులంతా భూకబ్జా దారులేనని ఆరోపిస్తూ.. వచ్చే ఎన్నికలలో వారికి గుణపాఠం తప్పదని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు హెచ్చరించారు. మా హయాంలో భూ కబ్జా కాలేదు. గోపాలపూర్‌లో […]

- గులాబీ పార్టీ భూకబ్జాదారులమయం..
- గోపాలపురం కబ్జాలో ‘వినయ్’ హస్తం
- మేము నిఖార్సైన కాంగ్రెస్ వాదులం
- రేవంత్ హాత్‌సే హాత్‌జోడో యాత్రలో పాల్గొంటాం
- 9 నుంచి తూర్పులో గడపగడపకు: మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అధికార గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులంతా భూకబ్జా దారులేనని ఆరోపిస్తూ.. వచ్చే ఎన్నికలలో వారికి గుణపాఠం తప్పదని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు హెచ్చరించారు. మా హయాంలో భూ కబ్జా కాలేదు. గోపాలపూర్‌లో ఎకరం 12 గుంటలు ఉంటే పొజిషన్ లో మాత్రం 32గుంటల భూమి ఉంది. టీఆర్ఎస్ పార్టీలో నేతలు అలా తయారయ్యారని విమర్శించారు. హనుమకొండలో శుక్రవారం మురళీధర్‌రావు మీడియాతో మాట్లాడారు.
గోపాలపురం ల్యాండ్ కబ్జా కేసులో స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ హస్తం ఉంది. ఒక హైదరాబాద్ ల్యాండ్ ప్రాబ్లం ఉందని ఏసీపీ నా వద్దకు వస్తే సమస్య తీర్చాను. ఇదే ల్యాండ్ విషయంలో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, తమ్ముడు వద్దకు పోతే అగ్రిమెంట్ చేయించుకునే వాళ్ళని విమర్శించారు.
వరంగల్ తూర్పు నుంచి పోటీ
వరంగల్ తూర్పులో కాంగ్రెస్ నుంచి కొండా సురేఖ పోటీ చేస్తుందని మురళి స్పష్టం చేశారు. 9వ తేదీ నుంచి గడపగడపకు కాంగ్రెస్ పేరుతో తూర్పులో పాదయాత్ర చేస్తారు. కొండా సురేఖ, కొండా సుష్మిత ఇద్దరూ కలిసి ప్రచారం చేస్తారు. కానీ ఒక్కరే పోటీ చేస్తారు. నా కూతురు రాజకీయాల్లోకి రాదని చెప్పారు. కొండా మురళి, సురేఖ, వేరే పార్టీలకు వెళ్తారని చెప్తున్నారు. మేము నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ వాళ్ళం. మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామన్నారు.
రేవంత్ యాత్రలో పాల్గొంటాం
రాహుల గాంధీ జోడో యాత్ర చేయడంతో ప్రజల్లో నమ్మకం కలిగింది. ఈ నెల 6 నుంచి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టబోయే హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొంటామని మురళి స్పష్టం చేశారు. మంత్రి దయాకర్ రావు గత ఎన్నికల్లో ఇది చివరి ఎన్నికలని మాయమాటలు చెప్పి సెలెన్ బాటిల్ ఎక్కించుకున్నారని తాను అలా కాదన్నారు.
ఎర్రబెల్లి ప్రదీప్ రావు, గన్ మెన్స్ ను వెనక్కి తీసుకుంటే దయాకర్ రావు ఎందుకు మాట్లాడలేదన్నారు. జాగృతి కవితక్క బ్రాందీ షాప్ స్కామ్ లపై పడ్డారని, కేజ్రీవాల్ ను కూడా స్కామ్ లో ఇరికించారని విమర్శించారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని మమ్మల్ని అడిగి త్వరలో ప్రకటిస్తారని మురళి చెప్పారు.