Odisha | నిమిషాల వ్య‌వ‌ధిలోనే మూడు రైళ్లు ఢీ..! ఒడిశా రైలు ప్ర‌మాదం ఎలా జ‌రిగిందంటే..?

Odisha | ఒడిశాలోని బాలేశ్వ‌ర్ జిల్లాలో శుక్ర‌వారం రాత్రి మాట‌ల‌కంద‌ని మ‌హా విషాదం చోటు చేసుకున్న విష‌యం విదిత‌మే. ఈ రైలు ప్ర‌మాదంలో మృతుల సంఖ్య 233కి చేరింది. 900 మందికి పైగా ప్ర‌యాణికులు వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు, రైల్వే ఉన్న‌తాధికారులు చెబుతున్నారు. ప‌లు బోగీల్లో ప‌లువురు ప్ర‌యాణికులు చిక్కుకున్నార‌ని, వారిని వెలికి తీస్తున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. ప్ర‌మాదం ఎలా జ‌రిగిందంటే..? బెంగ‌ళూరు నుంచి ప‌శ్చిమ బెంగాల్‌లోని […]

Odisha | నిమిషాల వ్య‌వ‌ధిలోనే మూడు రైళ్లు ఢీ..! ఒడిశా రైలు ప్ర‌మాదం ఎలా జ‌రిగిందంటే..?

Odisha | ఒడిశాలోని బాలేశ్వ‌ర్ జిల్లాలో శుక్ర‌వారం రాత్రి మాట‌ల‌కంద‌ని మ‌హా విషాదం చోటు చేసుకున్న విష‌యం విదిత‌మే. ఈ రైలు ప్ర‌మాదంలో మృతుల సంఖ్య 233కి చేరింది. 900 మందికి పైగా ప్ర‌యాణికులు వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు, రైల్వే ఉన్న‌తాధికారులు చెబుతున్నారు. ప‌లు బోగీల్లో ప‌లువురు ప్ర‌యాణికులు చిక్కుకున్నార‌ని, వారిని వెలికి తీస్తున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు.

ప్ర‌మాదం ఎలా జ‌రిగిందంటే..?

బెంగ‌ళూరు నుంచి ప‌శ్చిమ బెంగాల్‌లోని హౌరాకు వెళ్తున్న బెంగ‌ళూరు – హౌరా సూప‌ర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బాలేశ్వ‌ర్ స‌మీపంలోని బ‌హ‌నగా బ‌జార్ వ‌ద్ద శుక్ర‌వారం రాత్రి 7 గంట‌ల స‌మ‌యంలో ప‌ట్టాలు త‌ప్పింది. దీంతో సూప‌ర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బోగీలు ప‌క్క‌నే ఉన్న ప‌ట్టాల‌పై ప‌డిపోయాయి. ఈ బోగీల‌ను షాలిమార్ – చెన్నై సెంట్ర‌ల్ కోర‌మండ‌ల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది.

దీంతో కోర‌మండ‌ల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 15 బోగీలు బోల్తాప‌డ్డాయి. ఈ ప్ర‌మాదం అక్క‌డితో ఆగిపోలేదు. బోల్తాప‌డ్డ కోర‌మండ‌ల్ ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీకొట్టింది. అంత నిమిషాల వ్య‌వ‌ధిలోనే ఈ మూడు ప్ర‌మాదాలు జ‌రిగాయి. దీంతో తీవ్ర‌త పెరిగింది. క్ష‌త‌గాత్రుల సంఖ్య పెరిగింది.

బోగీల్లోనే చిక్కుకుని ప‌లువురు ప్ర‌యాణికులు మృతి చెందారు. అయితే ప్ర‌మాదానికి కోర‌మండ‌ల్ ఎక్స్‌ప్రెస్ కోల్‌క‌తా నుంచి చెన్నైకి వెళ్తున్న‌ట్లు రైల్వే అధికారులు వెల్ల‌డించారు. అయితే తొలుత కోర‌మండ‌ల్ ఎక్స్‌ప్రెస్.. గూడ్స్ రైలును ఢీకొట్టింద‌ని ప్ర‌చారం జ‌రిగింది.