ఐసీయూ వార్డులోకి ప్ర‌వేశించిన ఆవు.. వీడియో వైర‌ల్

Cow in ICU | ఐసీయూ వార్డులోకి కేవ‌లం రోగుల‌ను మాత్ర‌మే పంపిస్తారు. రోగుల స‌హాయ‌కుల‌కు కూడా అనుమ‌తి ఇవ్వ‌రు. అంత క‌ఠినంగా నిబంధ‌న‌లు అమ‌లు చేస్తుంటారు ఆస్ప‌త్రి సిబ్బంది. కానీ ఓ ఆస్ప‌త్రి ఐసీయూ వార్డులోకి ఆవు ప్ర‌వేశించింది, ద‌ర్జాగా సంచ‌రించింది. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని రాజ్‌ఘ‌ర్ జిల్లా ఆస్ప‌త్రిలో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. రాజ్‌ఘ‌ర్ జిల్లా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి ఆవ‌ర‌ణ‌లో ఆవులు తిరుగుతుంటాయి. ఈ ఆవులు ఆస్ప‌త్రి లోప‌లికి రాకుండా చూసేందుకు ఓ […]

ఐసీయూ వార్డులోకి ప్ర‌వేశించిన ఆవు.. వీడియో వైర‌ల్

Cow in ICU | ఐసీయూ వార్డులోకి కేవ‌లం రోగుల‌ను మాత్ర‌మే పంపిస్తారు. రోగుల స‌హాయ‌కుల‌కు కూడా అనుమ‌తి ఇవ్వ‌రు. అంత క‌ఠినంగా నిబంధ‌న‌లు అమ‌లు చేస్తుంటారు ఆస్ప‌త్రి సిబ్బంది. కానీ ఓ ఆస్ప‌త్రి ఐసీయూ వార్డులోకి ఆవు ప్ర‌వేశించింది, ద‌ర్జాగా సంచ‌రించింది. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని రాజ్‌ఘ‌ర్ జిల్లా ఆస్ప‌త్రిలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. రాజ్‌ఘ‌ర్ జిల్లా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి ఆవ‌ర‌ణ‌లో ఆవులు తిరుగుతుంటాయి. ఈ ఆవులు ఆస్ప‌త్రి లోప‌లికి రాకుండా చూసేందుకు ఓ ఇద్ద‌రు సిబ్బందిని కూడా నియమించారు. ఎప్ప‌టిక‌ప్పుడు ఆవుల‌ను ఆస్ప‌త్రి నుంచి బ‌య‌ట‌కు పంపిస్తూ చ‌ర్య‌లు తీసుకుంటారు. అయితే నిన్న ఓ ఆవు సిబ్బంది క‌ళ్లుగ‌ప్పి ఐసీయూ వార్డులోకి ప్ర‌వేశించింది. ఆ వార్డులో ద‌ర్జాగా సంచ‌రించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ ఘ‌ట‌న‌పై సివిల్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ రాజేంద్ర ఖ‌టారియా స్పందించారు. విధుల్లో నిర్ల‌క్ష్యం వ‌హించిన వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ఇప్ప‌టికే వార్డు బాయ్‌, సెక్యూరిటీ గార్డును విధుల నుంచి తొల‌గించామ‌ని చెప్పారు. ఆవులు నిరంత‌రం ఆస్ప‌త్రిలోకి వ‌స్తుండ‌టంతో, వాటిని బ‌య‌ట‌కు పంపించేందుకు ఇద్ద‌రు సిబ్బందిని కూడా నియ‌మించిన‌ట్లు తెలిపారు.