CPM | బీసీ బంధుకు.. 250 కోట్ల కార్మిక సంక్షేమ నిధి.. కార్మిక ద్రోహం: సీపీఎం

CPM విధాత: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు(బీవోసీడబ్ల్యూ) నిధులు 250కోట్లను ఇటీవల బీసీ బంధు పథకం అమలుకు వినియోగించడం కార్మిక ద్రోహమని సీపీఎం కార్యదర్శి ఎం. శ్రీనివాస్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ చర్య పూర్తిగా చట్ట విరుద్దమని, సుప్రీంకోర్టు ఆదేశాలకు పూర్తి వ్యతిరేకమన్నారు. నిర్మాణ కార్మికుల బోర్డు నిధులను నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసమే వినియోగించాలని, ఇతర అవసరాలకు మళ్లీంచరాదని 2018లో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిందన్నారు. ఈ నిబంధనలను కరోనా సమయంలో ఫ్రభుత్వం ఉల్లంఘించి 1000కోట్లను […]

  • By: Somu    latest    Sep 21, 2023 12:16 PM IST
CPM | బీసీ బంధుకు.. 250 కోట్ల కార్మిక సంక్షేమ నిధి.. కార్మిక ద్రోహం: సీపీఎం

CPM

విధాత: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు(బీవోసీడబ్ల్యూ) నిధులు 250కోట్లను ఇటీవల బీసీ బంధు పథకం అమలుకు వినియోగించడం కార్మిక ద్రోహమని సీపీఎం కార్యదర్శి ఎం. శ్రీనివాస్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ చర్య పూర్తిగా చట్ట విరుద్దమని, సుప్రీంకోర్టు ఆదేశాలకు పూర్తి వ్యతిరేకమన్నారు. నిర్మాణ కార్మికుల బోర్డు నిధులను నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసమే వినియోగించాలని, ఇతర అవసరాలకు మళ్లీంచరాదని 2018లో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిందన్నారు.

ఈ నిబంధనలను కరోనా సమయంలో ఫ్రభుత్వం ఉల్లంఘించి 1000కోట్లను పౌరసరఫరాల శాఖకు బదలాయించిందని, ఇప్పుడు 250కోట్లు బీసీ బంధుకు మళ్లించిందని ఆరోపించారు. రాష్ట్రంలో నిర్మాణ కంపనీల నుండి, ఇతర భవన నిర్మాణాల నుండి లేబర్ సెస్ ద్వారా బోర్డుకు ఏటా వస్తున్న వందల కోట్ల ఆదాయాన్ని నిర్మాణ కార్మికులకు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

లేబర్ సెస్ వసూళ్లలో కూడా నిర్మాణ కంపనీలతో కుమ్మక్కైన అధికారులు వేలకోట్ల ఆదాయానికి గండి కొట్టారన్నారు. వచ్చిన ఆదాయం కూడా కార్మికులకు అందకుండా ప్రభుత్వం అక్రమ మళ్లింపులకు పాల్పడుతుందన్నారు. వెంటనే బోర్డు నుంచి గతంలో, ప్రస్తుతం దారి మళ్లించిన నిధులన్నింటిని తక్షణమే ప్రభుత్వం బోర్డుకు మళ్లించి కార్మికుల సంక్షేమానికి వెచ్చించాలలని డిమాండ్ చేస్తున్నామని, లేని పక్షంలో కార్మిక ఉద్యమాలు చేపడుతామన్నారు.