బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌.. CPM ఇప్పటికైనా గుర్తించినట్లేనా..?

విధాత: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రెండేండ్ల కిందట ఓ సందర్భంలో మాట్లాడుతూ… భారత్‌లో మోదీ మూలంగా ఫాసిజం తలెత్తబోదని ప్రకటించారు. ఎందుకంటే.. దేశంలో ఫాసిజం నెలకొల్పే స్థాయిలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందలేదని చెప్పుకొచ్చారు. కాలం గడిచింది. మోదీ తత్వమేంటో కాల క్రమంలో తెలిసి వస్తున్నది. మెజారిటీవాద ఆధిపత్య రాజకీయాలతో మోదీ ఏ విధంగా వ్యక్తివాద నియంతృత్వాన్ని అమలు చేస్తున్నాడో అనుభవంలోకి వస్తున్నది. ఇప్పటికైనా మోదీ విధానాలను వ్యతిరేకించే వారిలో మార్పు రావాలని రాజకీయ […]

  • By: krs    latest    Nov 30, 2022 11:38 AM IST
బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌.. CPM ఇప్పటికైనా గుర్తించినట్లేనా..?

విధాత: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రెండేండ్ల కిందట ఓ సందర్భంలో మాట్లాడుతూ… భారత్‌లో మోదీ మూలంగా ఫాసిజం తలెత్తబోదని ప్రకటించారు. ఎందుకంటే.. దేశంలో ఫాసిజం నెలకొల్పే స్థాయిలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందలేదని చెప్పుకొచ్చారు. కాలం గడిచింది.

మోదీ తత్వమేంటో కాల క్రమంలో తెలిసి వస్తున్నది. మెజారిటీవాద ఆధిపత్య రాజకీయాలతో మోదీ ఏ విధంగా వ్యక్తివాద నియంతృత్వాన్ని అమలు చేస్తున్నాడో అనుభవంలోకి వస్తున్నది. ఇప్పటికైనా మోదీ విధానాలను వ్యతిరేకించే వారిలో మార్పు రావాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

బ్రెజిల్‌లో నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా విపక్షపార్టీలన్నీ ఏకమై ఎలా ప్రభుత్వాన్నిగద్దె దించాయో, భారత్‌లో కూడా అదే జరగాలని అభిలషిస్తున్నారు. ఆ క్రమంలోనే టీఆర్‌ఎస్‌తో సీపీఐ, సీపీఎం పార్టీలు జతకట్టాయని అంటున్నారు. కాంగ్రెస్‌తో సహా మోదీ వ్యతిరేక శక్తులు, పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉన్నదంటున్నారు.

ప్రాంతీయ పార్టీలు చిన్నా చితకా అన్నీ ఎంత చేప్పినా బీజేపీకి ఏ రూపంలో ప్రత్యామ్నాయం కాబోవని అంటున్నారు. మోదీ ప్రమాదాన్నిఎదుర్కోవటంలో కాంగ్రెస్‌ మాత్రమే ప్రబల శక్తి. కాంగ్రెస్‌ లేకుండా బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా రూపొందటం అసాధ్యమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.