ఉద్యోగ నియామక ప్రక్రియపై CS శాంతికుమారి సమీక్ష సమావేశం
విధాత: ఉద్యోగ నియామక ప్రక్రియపై నియామక బోర్డుల అధికారులతో సీఎస్ శాంతికుమారి సమీక్ష జరుగుతున్నది. ఈ సమీక్షకు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్ శ్రీనివాసరావు, గురుకుల నియామక బోర్డు కార్యదర్శి మల్లయ్య భట్టు, వైద్య నియామక బోర్డు జేడీ గోపీకాంత్, ఆర్థిక కార్యదర్శి రోనాల్డ్ రోస్, జేడీఏ ముఖ్యకార్యదర్శి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హాజరయ్యారు. ఈ సమయంలోనే ఓయూ జేఏసీనేతలు బీఆర్‌క్కే భవన్‌ను ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ కల్వకుంట్ల ప్రభుత్వం […]

విధాత: ఉద్యోగ నియామక ప్రక్రియపై నియామక బోర్డుల అధికారులతో సీఎస్ శాంతికుమారి సమీక్ష జరుగుతున్నది. ఈ సమీక్షకు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్ శ్రీనివాసరావు, గురుకుల నియామక బోర్డు కార్యదర్శి మల్లయ్య భట్టు, వైద్య నియామక బోర్డు జేడీ గోపీకాంత్, ఆర్థిక కార్యదర్శి రోనాల్డ్ రోస్, జేడీఏ ముఖ్యకార్యదర్శి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హాజరయ్యారు.
ఈ సమయంలోనే ఓయూ జేఏసీనేతలు బీఆర్‌క్కే భవన్‌ను ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ కల్వకుంట్ల ప్రభుత్వం నిరుద్యోగుల పొట్ట కొడుతున్నదని, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లీకేజీ వెనుక మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఉన్నదని వారు ఆరోపించారు.
ఈ అవినీతి ప్రభుత్వాన్ని గద్ద దింపేవరకు తాము విశ్రమించేది లేదన్నారు. ఈ లీకేజీ వ్యవహారంలో సర్వీస్ కమిషన్ ఛైర్మన్, సభ్యులు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. నిరుద్యోగులతో చెలగామా ఖబడ్దార్ అని హెచ్చరించారు. మాకు న్యాయం కావాలి అన్నారు.