HOROSCOPE | దిన ఫలాలు (చంద్రచారము ఆధారంగా) తేదీ : 29.05.2023; చంద్రచారము ఉదయం 8.51 గంటల వరకు సింహరాశి, తదుపరి కన్యారాశి. Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించే వారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారి కోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. మేషరాశి: చంద్రుడు ఉదయం 8.51 గంటల వరకు 5వ ఇంట […]
HOROSCOPE | దిన ఫలాలు (చంద్రచారము ఆధారంగా)
తేదీ : 29.05.2023; చంద్రచారము ఉదయం 8.51 గంటల వరకు సింహరాశి, తదుపరి కన్యారాశి.
Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించే వారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారి కోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేషరాశి: చంద్రుడు ఉదయం 8.51 గంటల వరకు 5వ ఇంట ఉంటున్నందున ప్రతికూల పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నది. కొన్ని స్వల్ప నష్టాలు, వృత్తిపరమైన సమస్యలు ఉంటాయి. ఫలితంగా మానసిక వేదన అనుభవించే అవకాశం ఉన్నది.
తదుపరి చంద్రుడు ఉదయం 8.51 గంటల నుంచి 6వ ఇంటకు మారుతున్నందున అప్పటి నుంచి అంతా సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక, గృహ, ఆరోగ్య, కుటుంబ విషయాల్లో చెప్పుకోతగిన మార్పులు చోటు చేసుకుంటాయి.
వృషభరాశి: చంద్రుడు ఉదయం 8.51 గంటల వరకు 4వ ఇంట ఉంటున్నందున ప్రతికూల ప్రభావాలు కలిగే అవకాశం ఉన్నది. కొన్ని స్వల్ప వృత్తిపరమైన ఇబ్బందుల కారణంగా భేదాభిప్రాయాలు, శత్రుత్వాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నది.
తదుపరి చంద్రుడు ఉదయం 8.51 గంటల నుంచి 5వ ఇంటకు మారుతున్నాడు. ఇది కూడా ప్రతికూల ప్రభావాలనే కలిగిస్తుంది. కొన్ని స్వల్ప నష్టాలు, వృత్తిపరమైన ఇబ్బందుల కారణంగా మానసిక వేదనకు గురయ్యే అవకాశం ఉన్నది.
మిథునరాశి: చంద్రుడు ఉదయం 8.51 గంటల వరకు 3వ ఇంట ఉంటున్నందున అన్నీ శుభాలే కలుగుతాయి. ఆర్థిక, వృత్తి, కుటుంబ విషయాల్లో సానుకూలంగా ఉంటుంది.
అయితే.. తదుపరి చంద్రుడు ఉదయం 8.51 గంటల నుంచి 4వ ఇంటకు మారుతున్నందున ప్రతికూల ప్రభావాలు కనిపించే అవకాశం ఉన్నది. కొన్ని స్వల్ప నష్టాలు, ఇబ్బందులు చోటు చేసుకునే అవకాశం ఉన్నది. ఫలితంగా వివాదాలు, శత్రుత్వాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.
కర్కాటక రాశి: చంద్రుడు ఉదయం 8.51 గంటల వరకు 2వ ఇంట ఉంటున్నందున ప్రతికూల ప్రభావాలు కనిపించే అవకాశం ఉన్నది. కొన్ని నష్టాలు, కుటుంబ ఇబ్బందుల కారణంగా టెన్షన్‌కు, దిగులుకు గురయ్యే అవకాశం ఉన్నది.
తదుపరి చంద్రుడు ఉదయం 8.51 గంటల నుంచి 3వ ఇంటకు మారుతున్నందున సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో మెరుగైన ఫలితాలను ఆశించవచ్చు.
సింహరాశి: చంద్రుడు ఉదయం 8.51 గంటల వరకు 1వ ఇంట ఉంటున్నందున అన్నీ సానుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక, వృత్తి, కుటుంబ విషయాల్లో సానుకూల పరిణామాలు కనిపిస్తాయి.
తదుపరి చంద్రుడు 2వ ఇంటకు మారుతున్నందున ప్రతికూల పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తున్నది.
కన్యారాశి: చంద్రుడు ఉదయం 8.51 గంటల వరకు 12వ ఇంట ఉంటున్నందున అననుకూల పరిణామాలు తలెత్త వచ్చు. కొన్ని వృత్తి, వ్యాపార రంగాల్లోని వారికి కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. ఫలితంగా అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉన్నది.
తదుపరి చంద్రుడు ఉదయం 8.51 గంటల నుంచి 1వ ఇంటకు మారుతున్నందున అంతా సవ్యంగా ఉంటుంది. ఆర్థిక, వృత్తి రంగాల వారికి సానుకూల పరిణామాలు కనిపిస్తాయి. కుటుంబ విషయాల్లోనూ సవ్యంగా ఉంటుంది.
తులారాశి: చంద్రుడు ఉదయం 8.51 గంటల వరకు 11వ ఇంట ఉంటున్నందున శుభాలు కలుగుతాయి. ఆర్థిక, గృహ, కుటుంబ విషయాల్లో లాభదాయకంగా ఉంటుంది.
తదుపరి చంద్రుడు ఉదయం 8.51 గంటల నుంచి 12వ ఇంటకు మారుతున్నందున ప్రతికూల ప్రభావాలు కనిపించవచ్చు. వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు కలుగవచ్చు. ఫలితంగా అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉన్నది.
వృశ్చికరాశి: చంద్రుడు ఉదయం 8.51 గంటల వరకు చంద్రుడు 10 ఇంట ఉంటున్నందున సానుకూల పరిణామాలు ఉంటాయి. ఆర్థిక విషయాలతోపాటు, ఆరోగ్య, కుటుంబ అంశాల్లో సాఫల్యాలు ఉంటాయి.
తదుపరి చంద్రుడు ఉదయం 8.51 గంటల నుంచి 11వ ఇంటకు మారుతున్నందున శుభాలే ఉంటాయి. ఆర్థిక, వృత్తి, కుటుంబ విషయాల్లో లాభదాయకంగా ఉంటాయి.
ధనూరాశి: చంద్రుడు ఉదయం 8.51 గంటల వరకు 9వ ఇంట ఉంటున్నందున ప్రతికూల ప్రభావాలు చోటు చేసుకుంటాయి. స్వల్ప నష్టాలు, కొన్ని కుటుంబ సమస్యల కారణంగా మనసు వేదనతో, విచారంగా ఉంటుంది.
తదుపరి ఉదయం 8.51 గంటల నుంచి 10వ ఇంటకు మారుతున్నందున అన్నీ సవ్యంగా సాగిపోతాయి. ఆర్థిక విషయాల్లో చెప్పుకోతగిన మార్పలు చూస్తారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఉన్నవారికీ గణనీయమైన విజయాలు కలుగుతాయి.
మకరరాశి: చంద్రుడు ఉదయం 8.51 గంటల వరకు 8వ ఇంట ఉంటున్నందున ప్రతికూల పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నది. కొన్ని ఆర్థిక నష్టాలు, కుటుంబ సమస్యల కారణంగా స్వల్ప ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.
తదుపరి చంద్రుడు ఉదయం 8.51 గంటల నుంచి 9వ ఇంటకు మారుతున్నందున ప్రతికూల ఫలితాలనే ఇస్తుంది. కొన్ని నష్టాలు, కుటుంబ ఇబ్బందులతో టెన్షన్‌కు, బాధలకు లోనవుతారు.
కుంభరాశి: చంద్రుడు ఉదయం 8.51 గంటల వరకు 7వ ఇంట ఉండటం సానుకలం. గృహ ఆరోగ్య, కుటుంబ విషయాల్లో మెరుగైన ఫలితాలను ఆశించవచ్చు. అయితే..
తదుపరి చంద్రుడు ఉదయం 8.51 గంటల నుంచి 8వ ఇంటకు మారుతుండటం ప్రతికూల ప్రభావాలను కలుగజేసే అవకాశం ఉన్నది. కొన్ని ఆర్థిక నష్టాలు, వృత్తిపరమైన ఇబ్బందుల కారణంగా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉన్నది.
మీనరాశి: చంద్రుడు ఉదయం 8.51 గంటల వరకు 6వ ఇంట ఉంటున్నందున అంతా సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలతోపాటు, గృహ, ఆరోగ్య విషయాల్లో చెప్పుకోతగిన విజయాలు కనిపిస్తాయి.
తదుపరి చంద్రుడు ఉదయం 8.51 గంటల నుంచి 7వ ఇంటకు మారుతున్నందున అన్నీ శుభాలే ఉంటాయి. ఆర్థిక, వృత్తి, కుటుంబ, ఆరోగ్య విషయాల్లో సాఫల్యాలు ఉంటాయి.
సూచిక: చంద్రుడు నిరంతరం భూమి చుట్టూ తిరుగుతున్నందున, దాని తాత్కాలిక ప్రభావం రోజులో ఏ సమయంలోనైనా మారవచ్చు. అందువల్ల, మారిన ప్రభావం దాని సమయంతో సూచించడమైనది.
ప్రభావాలు అనుకూలంగా ఉన్నాయా? లేదా ప్రతికూలంగా ఉన్నాయా? అనేది కూడా కూడా పేర్కొనడమైనది. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి.