Dasyaam Vinay Bhaskar | బీజేపీ.. ప్రతిపక్షాలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నది: దాస్యం వినయ్ భాస్కర్
ఈనెల 23న కేటీఆర్ పర్యటన కేంద్రంపై పోరాటం కొనసాగుతుంది ప్రజా క్షేత్రంలో బీజెపి తీరును ఎండగడతాం రైతుల పక్షపాతి బీఆర్ఎస్ ప్రభుత్వం 23న కుడా గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రతిపక్షాలపై బీజేపీ ప్రభుత్వం కావాలని దర్యాప్తు సంస్థలను ఉసిగొలుపుతోందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్, పశ్చిమ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ (Dasyaam Vinay Bhaskar) ఆరోపించారు. హనుమకొండలో గురువారం నిర్వహించిన […]

- ఈనెల 23న కేటీఆర్ పర్యటన
- కేంద్రంపై పోరాటం కొనసాగుతుంది
- ప్రజా క్షేత్రంలో బీజెపి తీరును ఎండగడతాం
- రైతుల పక్షపాతి బీఆర్ఎస్ ప్రభుత్వం
- 23న కుడా గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ
- రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రతిపక్షాలపై బీజేపీ ప్రభుత్వం కావాలని దర్యాప్తు సంస్థలను ఉసిగొలుపుతోందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్, పశ్చిమ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ (Dasyaam Vinay Bhaskar) ఆరోపించారు. హనుమకొండలో గురువారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. రైతుల తరఫున పోరాడిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. సీఎం కేసీఆర్ (CM KCR) రైతుల పక్షపాతి అని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. చివరకు ప్రభుత్వ పథకాలకు మార్గదర్శకాలుగా, నిజమైన గ్రామ అభివృద్ధి అంటే ఎలా ఉండాలో గంగదేవిపల్లి లాంటి ఊళ్ళో ప్రత్యక్షంగా చూపించిన బాలవికాస లాంటి స్వచ్చంద సంస్థలను కూడా వదిలి పెట్టడం లేదన్నారు. క్రైస్తవ, ముస్లిం మైనారిటీ సంస్థలను అణచి వేయడమే నరేంద్ర మోడీ (Narendra Modi) ఏకైక లక్ష్యంగా కనబడుతోంది. బాలవికాస సంస్థ లపై ఐటీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.
ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలు
మహిళా బిల్లు (Women’s Bill) కోసం పోరాడినందుకే కవిత (Kavitha) పై ఈడీ సీబీఐ కేసులను కుట్రపూరితంగా మోపారని వినయ్ అన్నారు. కేంద్రంపై పోరాడుతున్న ఇతర ప్రతిపక్ష పార్టీలను పైన కూడా బీజేపీ కక్షపూరితంగా దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలిసింది. ప్రాజెక్ట్ లను నిర్మించడం, పేదరికాన్ని నిర్మూలించడమైతే, మత విద్వేషాలను రెచ్చగొట్టి దేశాన్ని విడగొట్టడం, తమను ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీలను ప్రభుత్వాలను పడగొట్టడం మాత్రమే నరేంద్ర మోడి కి తెలిసిందని అన్నారు.
23న కేటీఆర్ పర్యటన
ఈనెల 23న హనుమకొండ జిల్లాలో రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తామరక రామారావు (Minister KTR) పర్యటించనున్నారని వినయ్ తెలిపారు. పలు పలు అభివృద్ధి కార్యక్రమాలు, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. బండి సంజయ్ (Bandi Sanjay) కవితకు భేషరతుగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు.