యాదాద్రిని సందర్శించిన డిఫెన్స్ కాలేజ్ ప్రతినిధులు

విధాత: తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను పరిశీలించడానికి వచ్చిన నేషనల్ డిఫెన్స్ కాలేజీ ప్రతినిధుల బృంద సభ్యులు బుధవారం శ్రీయాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామి వారిని దర్శించుకున్నారు. బృందంలో ఐదుగురు విదేశీయులు ఉన్నారు. యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి వారికి ఆలయ విశిష్టతలు, ఆలయ పునర్నిర్మాణ రీతులను వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దృఢ సంకల్పంతో ఈ కాలంలో ఎక్కడా లేని విధంగా నూటికి నూరు […]

  • By: krs    latest    Feb 01, 2023 1:10 PM IST
యాదాద్రిని సందర్శించిన డిఫెన్స్ కాలేజ్ ప్రతినిధులు

విధాత: తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను పరిశీలించడానికి వచ్చిన నేషనల్ డిఫెన్స్ కాలేజీ ప్రతినిధుల బృంద సభ్యులు బుధవారం శ్రీయాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామి వారిని దర్శించుకున్నారు. బృందంలో ఐదుగురు విదేశీయులు ఉన్నారు.

యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి వారికి ఆలయ విశిష్టతలు, ఆలయ పునర్నిర్మాణ రీతులను వివరించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దృఢ సంకల్పంతో ఈ కాలంలో ఎక్కడా లేని విధంగా నూటికి నూరు శాతం రాతి కట్టడాలతో, కృష్ణ శిలలతో నిర్మితమైన దేవాలయమని, ఆర్కిటెక్ పనులు అమోఘమని బృందం సభ్యులు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మందడి ఉపేందర్ రెడ్డి, నేషనల్ డిఫెన్స్ కాలేజీ నోడల్ లైజనింగ్ అధికారి వెంకట శరత్, ఆలయ సిబ్బంది ఉన్నారు.