Delivery Boy Scam | మరో కొత్త తరహ మోసం మోపైంది.. అమెజాన్‌ ఆర్డర్‌ వచ్చిందంటూ బురిడీ

Delivery Boy Scam | సైబ‌ర్ నేర‌గాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయ‌కుల‌ను మోసం చేసేందుకు కొత్త పంథా ఎంచుకున్నారు. నిన్నటి వరకు ఆధార్‌  లింక్‌ అని, బ్యాంక్‌ నుంచని, కరెంటు బిల్లులంటూ కొత్త తరహ మోసంతో జనాల డబ్బును గుంజేస్తున్న కేటుగాళ్లు ఇప్పుడు మరో అడుగు ముందుకేసి అన్‌లైన్‌ ఆర్డర్‌ వచ్చిందంటూ సైబ‌ర్ మోసాలకు పాల్ప‌డుతున్నారు. మనం ఎలాంటి ఆర్డ‌ర్ చేయ‌కుండానే.. ఓ డెలివ‌రీ బాయ్ మీ పేరున్న ఓ పార్శల్‌తో మీ ఇంటికి వచ్చి ఆన్‌లైన్‌లో (అమెజాన్‌, […]

  • By: raj    latest    Aug 31, 2023 9:02 AM IST
Delivery Boy Scam | మరో కొత్త తరహ మోసం మోపైంది.. అమెజాన్‌ ఆర్డర్‌ వచ్చిందంటూ బురిడీ

Delivery Boy Scam |

సైబ‌ర్ నేర‌గాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయ‌కుల‌ను మోసం చేసేందుకు కొత్త పంథా ఎంచుకున్నారు. నిన్నటి వరకు ఆధార్‌ లింక్‌ అని, బ్యాంక్‌ నుంచని, కరెంటు బిల్లులంటూ కొత్త తరహ మోసంతో జనాల డబ్బును గుంజేస్తున్న కేటుగాళ్లు ఇప్పుడు మరో అడుగు ముందుకేసి అన్‌లైన్‌ ఆర్డర్‌ వచ్చిందంటూ సైబ‌ర్ మోసాలకు పాల్ప‌డుతున్నారు.

మనం ఎలాంటి ఆర్డ‌ర్ చేయ‌కుండానే.. ఓ డెలివ‌రీ బాయ్ మీ పేరున్న ఓ పార్శల్‌తో మీ ఇంటికి వచ్చి ఆన్‌లైన్‌లో (అమెజాన్‌, ప్లిప్‌ కార్ట్‌) మీకు ఆర్డ‌ర్ వ‌చ్చింది ఓటీపీ చెప్పండి లేదా అమౌంట్‌ ఇవ్వండంటూ తొందర పెడతాడు. అస‌లు నేనెలాంటి ఆర్డ‌ర్ చేయ‌లేద‌ని మీరు చెబుతున్నా.. మీ పేరేంటి, మీసెల్‌ నెంబర్‌ ఏంటీ అని అడిగి ఇదిగో దీనిపై మీ పేరు, నంబరే ఉంది త్వరగా డబ్బులు ఇవ్వండి వెళ్లాలంటూ హడావుడి చేస్తారు.

దాని మీద మన పేరే ఉంది కదా అని మనం నమ్మి అలోచించకుండా తొందర పడితే మన జేబులకు చిల్లు పడడం ఖాయం. పైగా ఆ పార్శల్‌లో ఏమి ఉండదు. ఇలాంటి మోసాలు అ మధ్య హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ మోసాలపై ప్ర‌జ‌ల‌ను తెలంగాణ పోలీసులు అప్ర‌మ‌త్తం చేస్తున్నారు.

అలాంటి సంద‌ర్భంలో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మీ మొబైల్ నంబ‌ర్ చెప్ప‌కండి. ఒక వేళ మీరు ఓటీపీ నంబ‌ర్ చెబితే.. మీ ఖాతాలోని డ‌బ్బులు సైబ‌ర్ నేర‌గాళ్లు కొట్టేస్తారు. ఈ క్ర‌మంలో సైబ‌ర్ నేర‌గాళ్ల మోసాల ప‌ట్ల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని తెలంగాణ పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ పేరిట ఇంటికి వ‌చ్చే వారిని ఒకటికి రెండు సార్లు క్రాస్‌చెక్‌ చేసుకుంటే మంచిద‌ని పోలీసులు సూచిస్తున్నారు.