Karimnagar: ‘దేశ్‌కి బచావో BJPకి హఠావో’ నినాదంతో దేశవ్యాప్త ఆందోళ‌న‌: వెంక‌ట్‌రెడ్డి

దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్న బిజెపి పాలకులు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి విధాత‌: బిజెపి ప్రభుత్వం దేశ సంపదను కొల్లగొడుతూ కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఈ దోపిడీని అడ్డుకోవడం కోసం 'దేశ్ కి బచావో బీజేపీకి హఠావో ' నినాదంతో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు […]

Karimnagar: ‘దేశ్‌కి బచావో BJPకి హఠావో’ నినాదంతో దేశవ్యాప్త ఆందోళ‌న‌: వెంక‌ట్‌రెడ్డి
  • దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్న బిజెపి పాలకులు
  • సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి

విధాత‌: బిజెపి ప్రభుత్వం దేశ సంపదను కొల్లగొడుతూ కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఈ దోపిడీని అడ్డుకోవడం కోసం ‘దేశ్ కి బచావో బీజేపీకి హఠావో ‘ నినాదంతో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

బుధవారం కరీంనగర్ బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో బోయిని అశోక్ అధ్యక్షతన జరిగిన సిపిఐ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశ ప్రారంభానికి ముందు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సీపీఐ పతాకాన్ని చాడ వెంకటరెడ్డి ఎగురవేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తామని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు గుప్పించి, తీరా అధికారంలోకి రాగానే దేశంలో ఉన్న సంపదను ఆదానీ, అంబానీలకు కట్టబెట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నాడని అన్నారు. పెట్టుబడిదారుల, కార్పొరేట్ శక్తుల కనుసన్నల్లో మోడీ పరిపాలన కొనసాగుతున్నదని, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసి ప్రజలపై కేంద్రం తీరని భారం మోపుతున్నదని ఆరోపించారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని, అందులోని చట్టాలను, సవరణల పేరుతో మార్చాలని కుట్ర పన్నుతున్నారని, తద్వారా పౌరుల హక్కులను కాల రాస్తున్నారని ఆయన మండిపడ్డారు. దేశంలోని దళితులు, బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలు మేధావులపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని చెప్పారు. బిజెపి పాలన నుండి దేశాన్ని కాపాడుకోవడం కోసం సిపిఐ జాతీయ సమితి ఆధ్వర్యంలో ఏప్రిల్ మాసంలో దేశవ్యాప్తంగా దేశ్‌కి బచావో బిజెపికి హఠావో అనే నినాదంతో ప్రచార ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నామని, అందుకు పార్టీ శ్రేణులంతా సిద్ధం కావాలని చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు ఇచ్చినా అందులో ఏ ఒక్కటి అమలుకు నోచలేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇండ్ల స్థలాలు, నిరుద్యోగ భృతి, భూసమస్యల పరిష్కారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉందని విమ‌ర్శించారు. సమావేశంలో
సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, అందె.స్వామి, గూడెం లక్ష్మి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, బత్తుల బాబు, అన్ని మండలాల సీపీఐ కార్యదర్శులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.