Minister Jagadish Reddy | అన్ని రంగాల వారికి అభివృద్ధి ఫలాలు: మంత్రి జగదీశ్‌రెడ్డి.. మంత్రిని కలిసిన మాజీ మావోయిస్టు
మంత్రిని కలిసిన మాజీ మావోయిస్టు సత్యంరెడ్డి జనజీవన స్రవంతిలో కలువనున్నట్టు వెల్లడి.. అభినందించిన జగదీశ్‌రెడ్డి విధాత: సుదీర్ఘకాలం మావోయిస్టు ఉద్యమంలో పనిచేసిన నల్లగొండ జిల్లా, మిర్యాలగూడెం మండలం సుబ్బారెడ్డి గూడెం గ్రామవాసి గజ్జల సత్యంరెడ్డి జన జీవన స్రవంతిలోకి రావడాన్ని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి (Minister Jagadish Reddy) స్వాగతించారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామిగా ఉండాలని కోరారు. దాదాపు 17 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించిన సత్యంరెడ్డి.. ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. మంగళవారం […]

- మంత్రిని కలిసిన మాజీ మావోయిస్టు సత్యంరెడ్డి
- జనజీవన స్రవంతిలో కలువనున్నట్టు వెల్లడి.. అభినందించిన జగదీశ్‌రెడ్డి
విధాత: సుదీర్ఘకాలం మావోయిస్టు ఉద్యమంలో పనిచేసిన నల్లగొండ జిల్లా, మిర్యాలగూడెం మండలం సుబ్బారెడ్డి గూడెం గ్రామవాసి గజ్జల సత్యంరెడ్డి జన జీవన స్రవంతిలోకి రావడాన్ని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి (Minister Jagadish Reddy) స్వాగతించారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామిగా ఉండాలని కోరారు. దాదాపు 17 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించిన సత్యంరెడ్డి.. ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. మంగళవారం ఆయన మంత్రి జగదీశ్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నప్పటి అనుభవాలు, జైలు జీవితం గురించి సత్యంరెడ్డి.. మంత్రి జగదీశ్‌రెడ్డితో పంచుకున్నారు. తాను ఉద్యమంలోకి వెళ్లే నాటికి ఉన్న తెలంగాణకు, ఇప్పటి తెలంగాణకు పోలికే లేదని, అన్ని రంగాల్లో అద్భుత పురోగతిని సాధించిందని సత్యం రెడ్డి చెప్పారు. తాను ఉత్తరాది రాష్ట్రాలు చూశానని, ఇప్పడు తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఆ రాష్ట్రాల్లో లేదని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల వారికి అభివృద్ధి ఫలాలు పంచుతున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. జనజీవన స్రవంతిలోకి రావాలని నిర్ణయించుకున్న సత్యంరెడ్డిని జగదీశ్‌రెడ్డి అభినందించారు. సత్యంరెడ్డితోపాటు మంత్రిని కలిసినవారిలో ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు నామిరెడ్డి యాదగిరి రెడ్డి తదితరులు ఉన్నారు.
Miryalaguda: ఏమయ్యాడో తెలియదు.. 43 ఏళ్ల తర్వాత సొంతూరుకు.. మావోయిస్టు నేత గజ్జల