ఏంటి.. సాయి పల్లవికి పెళ్లి అయిందా.. నెట్టింట హల్‌చల్ చేస్తున్న పెళ్లి ఫొటో

చేసింది తక్కువ చిత్రాలే అయిన తన నటనతో అశేష ప్రేక్షకాదరణ పొందిన భామ సాయి పల్లవి. ఫిదా, ఎంసీఏ, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ విరాటపర్వం అనంతరం సినిమా చేయలేదు. రీసెంట్‌గా నాగ చైతన్యతో సినిమా చేస్తున్నట్టు ప్రకటించింది.
గార్గి సినిమా తర్వాత సాయి పల్లవికి చాలా మూవీ ఆఫర్స్ వచ్చినప్పటికీ అవి తనకి నచ్చక పోవడంతో రిజెక్ట్ చేసింది. శివ కార్తికేయన్ హీరోగా తెలుగు, తమిళ్ భాషలలో తెరకెక్కుతోన్న సినిమాకి ఆమె ఒకే చెప్పగా, కొద్ది రోజుల క్రితం ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ సినిమాను తమిళ దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్నారు.
దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి #SK21 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. లెజెండరీ నటుడు కమల్ హాసన్ హోమ్ బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. అయితే చిత్రం పూజా కార్యక్రమంలో చిత్రబృందానికి మెడలో పూల మాల వేసి స్వాగతం పలికారు.
ఈ క్రమంలో సాయి పల్లవి, దర్శకుడు పెయిరసామితో పాటు పలువురు మెడలో దండలు వేసుకోగా, కేవలం సాయి పల్లవి, పెయిరసామి పిక్‌తో మాత్రమే వైరల్ చేస్తూ వారిద్దరికి పెళ్లి అయినట్టు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అయితే ఈ వార్తలని ముందుగా విరాటపర్వం దర్శకుడు వేణు ఉడుగుల ఖండించారు. శివ కార్తికేయన్ కి జంటగా సాయి పల్లవి నటిస్తున్న చిత్రం పూజా కార్యక్రమం రోజు తీసిన ఫోటో అది అని అంటూ వేణు ఉడుగుల క్లారిటీ ఇచ్చారు.
ఇక సాయి పల్లవి విషయానికి వస్తే.. ఈ అమ్మడు తనకి మంచి క్రేజ్ ఉంది కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలకి మాత్రమే సైన్ చేస్తుంది. లేడి పవర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి ఈ మధ్య కమర్షియల్‌గా మంచి సక్సెస్ అందుకోలేకపోయింది.
చాలా గ్యాప్ తర్వాత తెలుగులో నాగ చైతన్యతో కలిసి సినిమా చేస్తుంది. గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కబోతున్న సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కోసం సాయి పల్లవి దాదాపుగా 5 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నట్టు సమాచారం. ఇదే ఈ అమ్మడి కెరియర్‌లో హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటున్నారు.