డర్టీ ప్లాన్.. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఇంజినీర్లపై సీఎం కేసీఆర్ ఆగ్రహం
విధాత: వరంగల్ జిల్లాలో నూతనంగా నిర్మించిన ప్రతిమ ఆస్పత్రి ప్రారంభోత్సవం అనంతరం వరంగల్ మెడికల్ సిటీకి కేసీఆర్ వెళ్లారు. అక్కడ వందల ఎకరాల్లో నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కేసీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి నిర్మాణం గురించి కేసీఆర్‌కు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వివరించారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డిజైన్లు, నిర్మాణం విషయంలో సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. డర్టీ ప్లాన్ అంటూ కేసీఆర్ నిప్పులు చెరిగారు. […]

విధాత: వరంగల్ జిల్లాలో నూతనంగా నిర్మించిన ప్రతిమ ఆస్పత్రి ప్రారంభోత్సవం అనంతరం వరంగల్ మెడికల్ సిటీకి కేసీఆర్ వెళ్లారు. అక్కడ వందల ఎకరాల్లో నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కేసీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి నిర్మాణం గురించి కేసీఆర్‌కు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వివరించారు.

సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డిజైన్లు, నిర్మాణం విషయంలో సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. డర్టీ ప్లాన్ అంటూ కేసీఆర్ నిప్పులు చెరిగారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ఆ ప్రాజెక్టు ఇంజినీర్లపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక క్రమ పద్ధతిలో ప్లాన్ లేదంటూ మండి పడ్డారు.
ప్రతిమ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. వరంగల్ మెడికల్ సిటీ గురించి చాలా గొప్పలు చెప్పారు. 24 అంతస్తుల్లో ఆస్పత్రి నిర్మాణం అవుతుందన్నారు. హైదరాబాద్ ఆస్పత్రులను మించిపోయేలా ఆ భవనం ఉంటుందన్నారు. ఆ భవనం ఎక్కి చూస్తే హైదరాబాద్ కూడా కనబడుతుందన్నారు.
అంతే కాదు.. హైదరాబాద్ రోగులు కూడా వరంగల్‌కు వచ్చి వైద్యం చేయించుకునేలా, అన్ని వసతులతో ఆస్పత్రిని నిర్మిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. వరంగల్ మెడికల్ సిటీ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. కానీ తీరా పనులను పరిశీలించిన అనంతరం ఆ ఆస్పత్రి ప్లాన్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేసి మంత్రిని, ఇంజినీర్లను మందలించారు.