ఆలేరు మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాసం
విధాత: ఆలేరు మున్సిపాలిటీ చైర్మన్ వస్పరి శంకరయ్యపై అధికార బిఆర్ఎస్ పార్టీకే చెందిన కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ మంగళవారం కలెక్టర్ పమేలసత్పత్తిని కలిసి నోటీస్ అందించారు. మొత్తం 12 మంది కౌన్సిలర్లలో బిఆర్ఎస్ పార్టీకి పదిమంది, ఒక ఇండిపెండెంట్, ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ ఉన్నారు. బిఆర్ఎస్ పార్టీకి చెందిన వస్పరి శంకరయ్య చైర్మన్ గా కొనసాగుతున్నారు. మూడేళ్ల పదవీకాలం ముగిసిపోవడం.. అవిశ్వాసానికి అడ్డంకి తొలగిపోవడంతో ఆయనపై అసంతృప్తిగా ఉన్న పది మంది కౌన్సిలర్లు అవిశ్వాసాన్ని ప్రతిపాదిస్తున్నారు. […]

విధాత: ఆలేరు మున్సిపాలిటీ చైర్మన్ వస్పరి శంకరయ్యపై అధికార బిఆర్ఎస్ పార్టీకే చెందిన కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ మంగళవారం కలెక్టర్ పమేలసత్పత్తిని కలిసి నోటీస్ అందించారు. మొత్తం 12 మంది కౌన్సిలర్లలో బిఆర్ఎస్ పార్టీకి పదిమంది, ఒక ఇండిపెండెంట్, ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ ఉన్నారు.
బిఆర్ఎస్ పార్టీకి చెందిన వస్పరి శంకరయ్య చైర్మన్ గా కొనసాగుతున్నారు. మూడేళ్ల పదవీకాలం ముగిసిపోవడం.. అవిశ్వాసానికి అడ్డంకి తొలగిపోవడంతో ఆయనపై అసంతృప్తిగా ఉన్న పది మంది కౌన్సిలర్లు అవిశ్వాసాన్ని ప్రతిపాదిస్తున్నారు. వైస్ చైర్మన్ మొరిగాని మాధవి వెంకటేష్ అసమతి కౌన్సిలర్ల బృందానికి నాయకత్వం వహిస్తున్నారు.