Supreme Court | విడాకులు.. వెంటనే మంజూరు చేయాలి: సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Supreme Court విడాకులపై సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పు ఆరు నెలల వ్యవధి తప్పనిసరి కాదని వెల్లడి ఆర్టికల్ 142ను ఉపయోగించి వివాహం రద్దు చేయొచ్చని తీర్పు విధాత: విడాకుల కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. విడాకులు జారీ చేసే ముందు ఆరు నెలల వ్యవధి ఉండాలన్న నిబంధన తప్పనిసరి ఏమీ కాదని తేల్చి చెప్పింది. సరిదిద్దలేనంతగా వివాహ బంధం చెడిపోతే ఆ వివాహాన్ని ఆర్టికల్ 142 కింద తనకు సంక్రమించే […]

Supreme Court
- విడాకులపై సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పు
- ఆరు నెలల వ్యవధి తప్పనిసరి కాదని వెల్లడి
- ఆర్టికల్ 142ను ఉపయోగించి వివాహం రద్దు చేయొచ్చని తీర్పు
విధాత: విడాకుల కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. విడాకులు జారీ చేసే ముందు ఆరు నెలల వ్యవధి ఉండాలన్న నిబంధన తప్పనిసరి ఏమీ కాదని తేల్చి చెప్పింది. సరిదిద్దలేనంతగా వివాహ బంధం చెడిపోతే ఆ వివాహాన్ని ఆర్టికల్ 142 కింద తనకు సంక్రమించే అధికారాలను ఉపయోగించి రద్దు చేయవచ్చని తెలిపింది.
కేసుకు ఉన్న పరిస్థితుల దృష్ట్యా హిందూ వివాహ చట్టంలోని ఆరు నెలల వ్యవధి నిబంధనను పక్కన పెట్టవచ్చని జస్టిస్ ఎస్‌కే కౌల్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు చెప్పింది.
వివాహ బంధం మెరుగు పర్చుకోడానికి అవకాశం లేని కేసుల్లో వెంటనే విడాకులు మంజూరు చేయాలని నిర్దేశించింది. ఇప్పటి వరకు ఉన్న వివాహ చట్టాల ప్రకారం ఫ్యామిలీ కోర్టులు విడాకులను కోరిన జంట తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవడం కోసం 6 నెలల సమయం ఇస్తున్నాయి.
అయితే విడాకుల కేసులో ఆర్టికల్ 142 ప్రకారం తన ప్రత్యేక అధికారాలను ఉపయోగించి సుప్రీంకోర్టు కొత్తగా విడాకుల కేసులపై మార్గదర్శకం చేసింది. విడాకులు కోరుతున్న జంటకు (ఇద్దరూ కోరుకుంటే) త్వరగా విడాకులు మంజూరు చేసేందుకు అవకాశం కల్పించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు సమ్మతి తెలిపింది.
ఏమిటీ 142వ అధికరణం
తన ముందు పెండింగ్‌లో ఉన్న ఏ కేసులోనైనా సంపూర్ణ న్యాయం చేసేలా డిక్రీలు, ఆదేశాలు ఇచ్చేందుకు 142వ అధికరణం సుప్రీం కోర్టుకు అధికారాలు కల్పిస్తుంది. విడాకుల కోసం తనను ఆశ్రయించిన జంటలను ఫ్యామిలీ కోర్టుకు రిఫర్ చేయకుండా 142వ అధికరణం కింద సంక్రమించిన అధికారాలను ఉపయోగించి వివాహాన్ని రద్దు చేయడంపై వేర్వేరు పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరుపుతున్నది.