NMC | అలాంటి రోగుల‌కు చికిత్స నిరాక‌రించొచ్చు.. నేష‌న‌ల్ మెడిక‌ల్ క‌మిష‌న్ కీల‌క నిర్ణ‌యం

NMC | ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు ఆస్ప‌త్రుల్లో వైద్యుల‌పై రోగులు, వారి బంధువులు దాడులు చేయ‌డం చూస్తూనే ఉన్నాం. ఈ నేప‌థ్యంలో డాక్ట‌ర్ల‌పై దాడుల‌ను అరిక‌ట్టేందుకు నేష‌న‌ల్ మెడిక‌ల్ క‌మిష‌న్ రిజిస్ట‌ర్డ్ ప్రాక్టిష‌న‌ర్స్ నియామ‌వ‌ళి పేరుతో రూపొందించిన నిబంధ‌న‌లు అమ‌ల్లోకి తీసుకువ‌స్తున్న‌ట్లు నేష‌న‌ల్ మెడిక‌ల్ క‌మిషన్ స్ప‌ష్టం చేసింది. ఈ నిబంధ‌న ప్ర‌కారం.. డాక్ట‌ర్ల‌తో అనుచితంగా ప్ర‌వ‌ర్తించే రోగుల‌కు చికిత్స నిరాక‌రించొచ్చని ఎన్ఎంసీ పేర్కొంది. వైద్యుల‌పై హింస‌ను అరిక‌ట్ట‌డ‌మే ల‌క్ష్యంగా ఈ నిబంధ‌న‌లు అమ‌ల్లోకి తీసుకొస్తున్న‌ట్లు తెలిపింది. మొత్తంగా […]

  • By: raj    latest    Aug 11, 2023 3:40 AM IST
NMC | అలాంటి రోగుల‌కు చికిత్స నిరాక‌రించొచ్చు.. నేష‌న‌ల్ మెడిక‌ల్ క‌మిష‌న్ కీల‌క నిర్ణ‌యం

NMC | ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు ఆస్ప‌త్రుల్లో వైద్యుల‌పై రోగులు, వారి బంధువులు దాడులు చేయ‌డం చూస్తూనే ఉన్నాం. ఈ నేప‌థ్యంలో డాక్ట‌ర్ల‌పై దాడుల‌ను అరిక‌ట్టేందుకు నేష‌న‌ల్ మెడిక‌ల్ క‌మిష‌న్ రిజిస్ట‌ర్డ్ ప్రాక్టిష‌న‌ర్స్ నియామ‌వ‌ళి పేరుతో రూపొందించిన నిబంధ‌న‌లు అమ‌ల్లోకి తీసుకువ‌స్తున్న‌ట్లు నేష‌న‌ల్ మెడిక‌ల్ క‌మిషన్ స్ప‌ష్టం చేసింది.

ఈ నిబంధ‌న ప్ర‌కారం.. డాక్ట‌ర్ల‌తో అనుచితంగా ప్ర‌వ‌ర్తించే రోగుల‌కు చికిత్స నిరాక‌రించొచ్చని ఎన్ఎంసీ పేర్కొంది. వైద్యుల‌పై హింస‌ను అరిక‌ట్ట‌డ‌మే ల‌క్ష్యంగా ఈ నిబంధ‌న‌లు అమ‌ల్లోకి తీసుకొస్తున్న‌ట్లు తెలిపింది. మొత్తంగా కోడ్ ఆఫ్ మెడిక‌ల్ ఎథిక్స్ 2002 స్థానంలో కొత్త‌గా తీసుకొచ్చిన ఎన్ఎంసీఆర్ఎంపీ రెగ్యులేష‌న్ 2023 అమ‌ల్లోకి రానుంది.

రోగుల నుంచి చికిత్స నిమిత్తం వ‌సూలు చేసే ఫీజు వివ‌రాల‌ను ముందే రోగుల‌కు వైద్యులు తెలియ‌ జేయాలి. ముందుగా చెప్పిన ప్ర‌కారం ఫీజు చెల్లించ‌కుంటే డాక్ట‌ర్ చికిత్స నిరాక‌రించొచ్చు. అత్య‌వ‌స‌ర సేవ‌ల స‌మ‌యంలో మాత్రం ఈ నిబంధ‌న వ‌ర్తించ‌దు అని ఎన్ఎంసీ స్ప‌ష్టం చేసింది.

ఎవ‌రైనా రోగులు, వారి బంధువులు డాక్ట‌ర్ల ప‌ట్ల హింసాత్మ‌కంగా ప్ర‌వ‌ర్తిస్తే.. వారి ప్ర‌వ‌ర్త‌న గురించి రికార్డుల్లో రాసి, వేరేచోట త‌దుప‌రి చికిత్స చేయించుకునేలా వైద్యులు వారికి సూచించాలి. ప్రాణపాయ ప‌రిస్థితులు మిన‌హా డాక్ట‌ర్లు ఎవ‌రికి చికిత్స అందించాల‌నేది పూర్తిగా వారి స్వీయ నిర్ణ‌యంపై ఆధార‌ప‌డి ఉంటుంద‌ని పేర్కొంది.

రోగికి వైద్యం ప్రారంభించిన త‌ర్వాత వారి బంధువుల‌కు స‌మాచారం అందించ‌కుండా డాక్ట‌ర్ రోగికి చికిత్స నిరాక‌రించ‌కూడ‌దు. ఒక వేళ ప్ర‌స్తుతం చికిత్స చేస్తున్న వైద్యుడితో పాటు అద‌నంగా మ‌రో డాక్ట‌ర్ అవ‌స‌రం ఉంటే.. దాని గురించి రోగి లేదా అన‌తి కుటుంబ స‌భ్యుల‌కు త‌ప్ప‌నిస‌రిగా స‌మాచారం అందించాలి.

ఫార్మా సంస్థ‌ల నుంచి వైద్యులు అద‌నంగా ఎలాంటి గిఫ్ట్‌లు, ప్ర‌యాణి సౌక‌ర్యాలు పొంద‌కూడ‌దు. అలాగే ఫార్మా సంస్థ‌లు నిర్వ‌హించే విద్యాసంస్థ‌ల్లో జ‌రిగే వ‌ర్క్‌షాపులు, సెమినార్ల‌లో వైద్యులు పాల్గొన‌కూడ‌ద‌ని నిబంధ‌న‌ల్లో పేర్కొన్నారు.