కుక్క నోట్లో సగానికి తెగిపోయిన చెయ్యి.. భయాందోళనలో ప్రజలు
యూపీలో శుక్రవారం విస్తుపోయే ఘటన చోటు చేసుకున్నది. వీధికుక్క నోట్లో సగానికి తెగిపోయిన మనిషి చేయిని చూసి అక్కడి స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు

లక్నో: యూపీలో శుక్రవారం విస్తుపోయే ఘటన చోటు చేసుకున్నది. వీధికుక్క నోట్లో సగానికి తెగిపోయిన మనిషి చేయిని చూసి అక్కడి స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే లక్నో లోని కేజీఎంయూ ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాల్లో ఓ కుక్క నోట్లో మనిషి చేయి కనిపించింది. ఈ క్రమంలో అక్కడున్న వారు అరుపులతో పరుగులు తీశారు దీంతో ఆకుక్క చేయిని ఆసుపత్రి పరిసరాల్లోని మైదానంలో వదిలి పారిపోయింది. విషయం తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది ఆ చేతిని స్వాధీనం చేసుకున్నారు.
ఆ చేయి ఎవరిదనే దానిపై దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. ఈ మధ్య కాలంలో ఎవరి చేయి తొలగించారన్న విషయంపై రికార్డులు తిరగేయడం మొదలు పెట్టారు. ఈ విషయంపై ఆసుపత్రి అధికారులు మాట్లాడుతూ తెగిన చేయి కుక్కకు ఎలా దొరికిందన్న దానిపై విచారణ చేస్తున్నామన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా చెత్తకుండి నుంచి కుక్క నోట్లో పెట్టుకుని తిరుగుతుందని కొందరు అంటే, హాస్పటల్ మార్చ్యురి నుంచి శవం చేతిని కొరికి నోట పెట్టుకొని తిరుగుతుందని మరికొందరు అంటున్నారు.