గుడి గంటలను మోగించిన శునకం.. నెట్టింట వీడియో వైరల్
Dog in Temple | ఆలయం అనగానే గుర్తొచ్చేది పూజారి, గంట. పూజ అనంతరం హారతి ఇస్తున్న సమయంలో భక్తులందరూ అక్కడున్న గంటలను మోగిస్తూ.. చప్పట్లతో తమ భక్తిని చాటుకుంటారు. ఆ సమయంలో మనలో ఆధ్యాత్మిక భావన పెరిగిపోతోంది. మనసుకు ఏదో తెలియని హాయిని ఇస్తుంది. అలాంటి అనుభూతిని, హాయిని కూడా ఓ శునకం పొందింది. ఓ ఆలయానికి వెళ్లిన శునకం.. అక్కడున్న గంటలను మోగించింది. తన నోటితో గంట తాడును లాగి మోగించిన దృశ్యాలు సామాజిక […]

Dog in Temple | ఆలయం అనగానే గుర్తొచ్చేది పూజారి, గంట. పూజ అనంతరం హారతి ఇస్తున్న సమయంలో భక్తులందరూ అక్కడున్న గంటలను మోగిస్తూ.. చప్పట్లతో తమ భక్తిని చాటుకుంటారు. ఆ సమయంలో మనలో ఆధ్యాత్మిక భావన పెరిగిపోతోంది. మనసుకు ఏదో తెలియని హాయిని ఇస్తుంది. అలాంటి అనుభూతిని, హాయిని కూడా ఓ శునకం పొందింది.
ఓ ఆలయానికి వెళ్లిన శునకం.. అక్కడున్న గంటలను మోగించింది. తన నోటితో గంట తాడును లాగి మోగించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. గుడి గంట మోగించినంత సేపు శునకం ఆనందంలో మునిగిపోయింది. ఆధ్యాత్మికతతో.. కొత్త అనుభూతిని పొందింది ఆ శునకం. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కుక్కకు ఉన్న భక్తిని కొనియాడుతున్నారు.