TSRTC | తెలంగాణ బస్సుల్లో డైనమిక్ చార్జీలు
పాసింజర్లు, డిమాండ్, ట్రాఫిక్‌ను బట్టి టిక్కెట్ ధరల్లో పెరుగుదల, తగ్గుదల 27 నుంచి అమల్లోకి తెస్తామన్న సజ్జనార్ సాధారణ రోజుల్లో 20 నుంచి 30 శాతం తగ్గుదల విధాత : తెలంగాణ బస్సుల్లో ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో డైనమిక్ ప్రైసింగ్ సిస్టమ్ (TSRTC Dynamic Pricing system)ను అమల్లోకి తేనున్నట్టు టీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. బస్సులో ఉన్న ప్యాసింజర్ల సంఖ్య, ట్రాఫిక్, డిమాండ్ తదితరాలను బట్టి టికెట్ ధర మారుతూ ఉండటమే ‘డైనమిక్ ప్రైసింగ్’. పైలట్ ప్రాజెక్టుగా తొలుత […]

- పాసింజర్లు, డిమాండ్, ట్రాఫిక్‌ను బట్టి టిక్కెట్ ధరల్లో పెరుగుదల, తగ్గుదల
- 27 నుంచి అమల్లోకి తెస్తామన్న సజ్జనార్
- సాధారణ రోజుల్లో 20 నుంచి 30 శాతం తగ్గుదల
విధాత : తెలంగాణ బస్సుల్లో ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో డైనమిక్ ప్రైసింగ్ సిస్టమ్ (TSRTC Dynamic Pricing system)ను అమల్లోకి తేనున్నట్టు టీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. బస్సులో ఉన్న ప్యాసింజర్ల సంఖ్య, ట్రాఫిక్, డిమాండ్ తదితరాలను బట్టి టికెట్ ధర మారుతూ ఉండటమే ‘డైనమిక్ ప్రైసింగ్’. పైలట్ ప్రాజెక్టుగా తొలుత బెంగళూరు మార్గంలో 46 సర్వీసులలో అందుబాటులోకి తేనున్నారు. గురువారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో టీఎస్‌ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, సంస్థ ఎండీ, వైస్ ప్రెసిడెంట్ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ వివరాలు తెలిపారు.
విమానాలు, హోటళ్లు, ప్రైవేట్ బస్ ఆపరేటర్ల బుకింగ్‌లో ఇప్పటికే అమల్లో ఉన్న డైనమిక్ ప్రైసింగ్‌ను.. త్వరలోనే ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సదుపాయమున్న సర్వీస్లన్నింటిలోనూ అందుబాటులోకి తెచ్చేందుకు టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం కసరత్తు చేస్తోంది. pic.twitter.com/BywvGHx2K7
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) March 23, 2023
మార్చి 27వ తేదీ నుంచి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం నుంచి బెంగళూరుకు బయల్దేరే బస్సుల్లో ఈ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే డైనమిక్ ప్రైసింగ్ వ్యవస్థను ప్రైవేటు బస్ ఆపరేటర్లు వాడుతున్నారు. పలు హోటళ్లు, విమాన టికెట్లు, ట్రైన్ (తత్కాల్) టికెట్ల బుకింగ్‌లోనూ ఈ తరహా ధరల నిర్ణాయక వ్యవస్థ ఉన్నది. ట్రాఫిక్ తక్కువ ఉన్నట్టయితే టికెట్ ధర సాధారణ చార్జీకంటే తక్కువ ఉంటుంది. డిమాండ్ ఎక్కువగా ఉంటే దానికి అనుగుణంగా చార్జీ పెరుగుతుంది.
ప్రైవేటు ఆపరేటర్లు సాధారణ రోజుల్లోనూ అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని గోవర్ధన్‌రెడ్డి, సజ్జనార్ పేర్కొన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో మరింత వసూలు చేస్తున్నారని అన్నారు. ప్రైవేటు ఆపరేటర్లతో పోల్చితే ప్రజలకు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రయాణ సౌకర్యం కల్పించేందుకే తాము ఈ డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు. తద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని భావిస్తున్నామని చెప్పారు. ఈ విధానం వల్ల సాధారణ రోజుల్లో చార్జీలు 20 నుంచి 30 శాతం తగ్గిపోతాయని తెలిపారు.