Eatala Rajender | పేపర్లు లీక్‌ కావాలని చేశారా? యాధృచ్ఛికంగా జరిగిందా.. సీఎం కేసీఆర్‌ చెప్పాలి: ఈటల

విధాత: నాలుగు పరీక్షల పేపర్లు లీక్‌ అయ్యాయి అంటే ప్రభుత్వ పనితీరు కనిపిస్తున్నదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర బృందం గవర్నర్‌ను కలిసింది. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eatala Rajender), మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, డీకే అరుణ, మర్రి శశిధర్‌రెడ్డి, రాంచందర్‌, విఠల్‌ గవర్నర్‌ కలిసిన వారిలో ఉన్నారు. అనంతరం ఈటల మాట్లాడుతూ..ఇది కావాలని చేశారా? యాధృచ్ఛికంగా జరిగిందా అన్నది సీఎం కేసీఆర్‌ చెప్పాలన్నారు. పేపర్‌ […]

  • By: krs    latest    Mar 18, 2023 9:02 AM IST
Eatala Rajender | పేపర్లు లీక్‌ కావాలని చేశారా? యాధృచ్ఛికంగా జరిగిందా.. సీఎం కేసీఆర్‌ చెప్పాలి: ఈటల

విధాత: నాలుగు పరీక్షల పేపర్లు లీక్‌ అయ్యాయి అంటే ప్రభుత్వ పనితీరు కనిపిస్తున్నదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర బృందం గవర్నర్‌ను కలిసింది. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eatala Rajender), మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, డీకే అరుణ, మర్రి శశిధర్‌రెడ్డి, రాంచందర్‌, విఠల్‌ గవర్నర్‌ కలిసిన వారిలో ఉన్నారు.

అనంతరం ఈటల మాట్లాడుతూ..ఇది కావాలని చేశారా? యాధృచ్ఛికంగా జరిగిందా అన్నది సీఎం కేసీఆర్‌ చెప్పాలన్నారు. పేపర్‌ లీకేజీపై సీఎం సమీక్ష చేయడం లేదు. దీనికి సీఎం నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని, సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని ఈటల డిమాండ్‌ చేశారు.

లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు.రద్దైన పరీక్షలు తక్షణమే నిర్వహించాలన్నారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, కమిషన్‌ సభ్యులు రాజీనామా చేయాలన్నారు.