పార్లమెంటు ఎన్నికల అభ్యర్థి వ్యయ పరిమితి పెంపు

రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది

పార్లమెంటు ఎన్నికల అభ్యర్థి వ్యయ పరిమితి పెంపు

విధాత : రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల్లో గరిష్ఠంగా రూ. 95 లక్షలు ఖర్చు చేయవచ్చని పేర్కోంది. ప్రచార వాహనాల సంఖ్యను 5 నుంచి 14కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ లకు 12,500, ఇతరులు రూ.25,000 చొప్పున డిపాజిట్ చేయాల్సి ఉంటుందని తెలిపింది.


గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీల తరఫున నామినేషన్లు వేసే అభ్యర్థులను కనీసం ఒక ఓటరు, ఇతర అభ్యర్థులను కనీసం 10 ఓటర్లు ప్రతిపాదించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే అన్ని పార్టీలు తమ మ్యానిఫెస్టో ప్రకటన తర్వాతా మూడు రోజుల్లోగా ఆయా రాష్ట్రాల ప్రాంతీయ భాష తో పాటుగా హిందీ, ఇంగ్లీష్‌లలో కూడా ముద్రించి ఎన్నికల సంఘానికి సమర్పించాలని తెలిపింది.