Heavy Rains | భారీ నుంచి అతి భారీ వర్షాలు.. స్కూళ్లకు నాలుగు రోజులు సెలవులు
Heavy Rains | నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయి. దీంతో అన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గోవా, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేరళలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక రాబోయే నాలుగు రోజుల్లో కూడా […]

Heavy Rains |
నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయి. దీంతో అన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గోవా, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేరళలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక రాబోయే నాలుగు రోజుల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది.
కన్నూరు, కాసర్‌గఢ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేశారు. ఇడుక్కికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. కాసర్‌గఢ్, ఎర్నాకులం, అలప్పుజా జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు నాలుగు రోజుల పాటు సెలవు ప్రకటించారు.
రాబోయే రోజుల్లో ఢిల్లీ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జులై 6, 7 తేదీల్లో ముంబైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్, తెహ్రీ, పౌరీ, ఉత్తరకాశీ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ అయింది. తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.