కవిత నివాసంలో ఈడీ, ఐటీ ఆకస్మిక సోదాలు
బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో శుక్రవారం మధ్యాహ్నం ఈడీ, ఐటీ బృందాలు ఆకస్మిక సోదాలు చేపట్టాయి

భారీగా పోలీసు బలగాల మోహరింపు
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
విధాత, హైదరాబాద్ : బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో శుక్రవారం మధ్యాహ్నం ఈడీ, ఐటీ బృందాలు ఆకస్మిక సోదాలు చేపట్టాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 10మంది అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తుంది. ఈడీ, ఐటీ అధికారులు సంయుక్తంగా నాలుగు బృందాలుగా ఏర్పడి కవిత నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల సందర్భంగా కవిత నివాసం దగ్గర భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ సమన్లు రద్దు చేయాలన్న కవిత పిటిషన్ విచారణను శుక్రవారం సుప్రీంకోర్టు ఈనెల 19 కి వాయిదా వేసింది. ఇది ఇలా ఉండగానే ఈడీ, ఐటీలు కవిత నివాసంలో ఆకస్మిక సోదాలు చేపట్టడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.