Nayeem Case: నయీం కుటుంబసభ్యులపై ఈడీ నాన్ బెయిలబుల్ వారెంట్?

గ్యాంగ్ స్టర్  నయీం కుటుంబ సభ్యులపై ఈడీ మరోసారి కొరడా జుళిపించింది. అక్రమాస్తులకు సంబంధించి నయీం కుటుంబసభ్యులకు విచారణకు రావాలని జారీ చేసిన నోటీసులకు స్పందించకపోవడంతో వారికి నాన్ బెయిలబుల్ వారెంట్(NBW) జారీ చేయాలని ఈడీ కోర్టును కోరింది.

Nayeem Case:  నయీం కుటుంబసభ్యులపై ఈడీ నాన్ బెయిలబుల్ వారెంట్?

Nayeem Case: గ్యాంగ్ స్టర్  నయీం కుటుంబ సభ్యులపై ఈడీ మరోసారి కొరడా జుళిపించింది. అక్రమాస్తులకు సంబంధించి నయీం కుటుంబసభ్యులకు విచారణకు రావాలని జారీ చేసిన నోటీసులకు స్పందించకపోవడంతో వారికి నాన్ బెయిలబుల్ వారెంట్(NBW) జారీ చేయాలని ఈడీ కోర్టును కోరింది. అక్రమంగా బెదిరించి లాక్కున్న భూములను తన కుటుంబ సభ్యుల పేర్ల మీద నయీం రిజిస్ట్రేషన్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా నయీం కుటుంబ సభ్యుల పేరిట ఉన్న 35 అక్రమ ఆస్తుల జప్తుకు ఈడీ చర్యలు చేపట్టింది. వాటి విలువ 11.50కోట్ల మేరకు ఉండనుందని సమాచారం. 2022 మార్చిలో ఈడీ నయీం ఆస్తులపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఐటీ అధికారులు, సిట్ సమాచారంతో ఈసీఐఆర్ నమోదు చేసింది. నయీం కుటుంబసభ్యుల పేర్లను అందులో చేర్చింది. కోట్ల ఆస్తులు తమ పేరిట ఉన్నప్పటికి నయీం కుటుంబ సభ్యులు ఐటీఆర్ కూడా ఫైల్ చేయకపోవడాన్ని ఈడీ గుర్తించింది. గ్యాంగ్‌స్టర్ నయీం కుటుంబ సభ్యులు హసీనా బేగం, తహీరా బేగం, సలీమా బేగం, అబ్దుల్ సలీం, అహేలాబేగం, సయ్యద్ నిలోఫర్ , ఫిర్దోస్ అంజూమ్, మహమ్మద్ ఆరిఫ్ ,హసీనా కౌసర్ పేర్ల మీద అక్రమాస్తులు రిజిస్టర్ చేసినట్లు ఈడి గుర్తించింది. అక్రమాస్తులకు సంబంధించి వారు ఈడీ విచారణకు హాజరుకాకపోవడంతో నాన్ బెయిల్ బుల్ వారెంట్ ల జారీకి ఈడీ కోర్టును ఆశ్రయించింది.

భారీగా అక్రమాస్తులు
2016 ఆగస్టు 8న షాద్ నగర్ ఎన్ కౌంటర్ లో గ్యాంగ్‌స్టర్ నయీం హతమయ్యాడు. అనంతరం నార్సింగిలోని నయీం ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా భారీగా అక్రమ ఆస్తులు వెలుగు చూశాయి. నయీం మరణించడంతో అతని బాధితులంతా బయటకు వచ్చి ఫిర్యాదులు చేశారు. వాటిని విచారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను ఏర్పాటు చేసింది. విచారణలో దాదాపు 250 కేసులు నమోదు చేశారు. ఇందులో 27 హత్య కేసులతో పాటు అనేక నేరాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. వీటికి సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ ఆ కేసుల దర్యాప్తు పూర్తి కాలేదు. దర్యాప్తులో అతని బినామీల పేరు మీద ఉన్న ఆస్తులను కొన్నింటిని సిట్ గుర్తించింది. అయితే.. పలువురు బాధితులు సైతం నయీం తమ ఆస్తులను లాక్కున్నట్లు ఫిర్యాదు చేశారు. నయీం భార్య పహీమ్ బేగం, అనుచరులు పాశం శ్రీను, అబ్దుల్ ఫహీమ్, నజీర్​లు ప్రయత్నించడంతో అప్పట్లో పోలీసులు అడ్డుకున్నారు.