చెంగిచర్ల బస్తీ వాసులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

హోలీ సంబరాల సందర్భంగా చెంగిచర్ల ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మల్కాజ్‌గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు

  • By: Somu    latest    Mar 26, 2024 11:21 AM IST
చెంగిచర్ల బస్తీ వాసులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
  • మల్కాజ్‌గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్


విధాత, హైదరాబాద్: హోలీ సంబరాల సందర్భంగా చెంగిచర్లలో బస్తీ వాసులు మైక్ పెట్టుకుని హోలీ ఆడుతున్న క్రమంలో కొంతమంది సంఘవిద్రోహ శక్తులు, గూండాలు గిరిజన మహిళలపై ఆకారణంగా దాడి చేసి విచ్చలవిడిగా కొట్టిన ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మల్కాజ్‌గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్‌లో బాధితులు కంప్లైంట్ చేద్దామని వెళ్తే కంప్లైంట్ తీసుకున్నప్పటికీ కూడా పోలీస్ స్టేషన్ సమక్షంలోనే మళ్లీ వారి మీద దాడి చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడమే కాకుండా ఎంక్వైరీ పేరిట 24 గంటలు గడిచినప్పటికీ ఎవరిని అరెస్ట్ చేయకుండా ఆ ప్రాంతంలో ఆ ప్రజలను భయాందోళనలకు గురి చేశారని ఈటల ఆరోపించారు.


చంగిచర్లలో అనేక సంవత్సరాలుగా కబేలా నిర్వహిస్తూ, బోన్స్ నుండి ఆయిల్ తీసే ఇల్లీగల్ దందా చేస్తున్నారని తెలిపారు. నార్త్ ఇండియన్‌లను తీసుకువచ్చి ఇక్కడ వ్యక్తులతో కలిసి గిరిజన మహిళల పైన దాడి చేయటం అత్యంత జుగుప్సాకరమైనదని, దీని మీద వెంటనే సమగ్రమైన ఎంక్వయిరీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. దాడికి బాధ్యులైన వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి, హత్య నేరం కింద వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని, లేకపోతే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.