నేడు గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌పై విచార‌ణ‌

  • By: krs    latest    Sep 26, 2023 1:18 AM IST
నేడు గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌పై విచార‌ణ‌
  • గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌పై హైకోర్టులో అప్పీల్ వేసిన టీఎస్ పీఎస్సీ
  • లంచ్‌మోష‌న్ ను తిరస్క‌రించిన హైకోర్టులోని డివిజ‌న్ బెంచ్
  • నేడు విచారించేందుకు అంగీక‌రించిన న్యాయ‌స్థానం


విధాత‌, హైద‌రాబాద్: తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను ర‌ద్దు చేస్తూ హైకోర్టు సింగ‌ల్ బెంచ్ ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ సోమ‌వారం టీఎస్‌పీఎస్సీ డివిజ‌న్ బెంచ్‌ను ఆశ్ర‌యించి లంచ్‌మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది.


గ్రూప్‌-1లో ప్రిలిమ్స్ పరీక్ష‌లో ఓఎమ్ఆర్ షీట్‌లో అభ్య‌ర్థుల ఫొటో, బ‌యోమెట్రిక్ లేకుండానే ప‌రీక్ష టీఎస్‌పీఎస్సీ ప‌రీక్ష చేప‌ట్టింద‌ని ఆరోపిస్తూ ప‌లువురు అభ్య‌ర్థులు హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.. దీనిపై విచారణ చేప‌ట్టిన సింగిల్ బెంచ్ ప‌రీక్ష‌ను ర‌ద్దు చేస్తూ తిరిగి మ‌ళ్లీ నిర్వ‌హించాల‌ని ఈనెల 23న‌ ఉత్త‌ర్వులు జారీ విష‌యం తెలిసిందే.



దీంతో సోమ‌వారం టీఎస్‌పీఎస్సీ డివిజ‌న్ బెంచ్‌కి లంచ్‌మోష‌న్ పిటిష‌న్‌ను దాఖ‌లుచేయ‌డంతో హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, జ‌స్టిస్ అనిల్‌కుమార్ ధ‌ర్మాస‌నం తిర‌స్క‌రించింది. దీనిపై (నేడు) మంగ‌ళ‌వారం విచార‌ణ జ‌రిపేందుకు అంగీక‌రించింది.