ED Chief Extensions | CBI, ED చీఫ్‌ల పదవీకాలం పొడిగింపు.. దర్యాప్తు సంస్థల స్వతంత్రతకు ముప్పు: అమికస్ క్యూరీ
2018 నుంచి ఈడీ చీఫ్‌గా మిశ్రా మూడు సార్లు పదవీకాలం పొడిగింపు విధాత: ఈడీ(ED), సీబీఐ(CBI) వంటి సంస్థల చీఫ్‌ల పదవీకాలాన్ని విడతలవారీగా పొడిగించుకుంటూ పోవడం ఆ సంస్థల స్వతంత్రత, సమగ్రతలకు నష్టం కలిగిస్తుందని సుప్రీం కోర్టు అమికస్ క్యూరీ (Amicus Curiae) కేవీ విశ్వనాథన్ అభిప్రాయపడ్డారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్ సంజయ్‌కుమార్ మిశ్రా (Sanjay Kumar Mishra) పదవీకాలం పొడిగింపును సవాలు చేస్తూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టుకు సహాయకుడిగా (అమికస్‌క్యూరీ) సీనియర్ న్యాయవాది విశ్వనాథన్ వ్యవహరిస్తున్నారు. […]

- 2018 నుంచి ఈడీ చీఫ్‌గా మిశ్రా
- మూడు సార్లు పదవీకాలం పొడిగింపు
విధాత: ఈడీ(ED), సీబీఐ(CBI) వంటి సంస్థల చీఫ్‌ల పదవీకాలాన్ని విడతలవారీగా పొడిగించుకుంటూ పోవడం ఆ సంస్థల స్వతంత్రత, సమగ్రతలకు నష్టం కలిగిస్తుందని సుప్రీం కోర్టు అమికస్ క్యూరీ (Amicus Curiae) కేవీ విశ్వనాథన్ అభిప్రాయపడ్డారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్ సంజయ్‌కుమార్ మిశ్రా (Sanjay Kumar Mishra) పదవీకాలం పొడిగింపును సవాలు చేస్తూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టుకు సహాయకుడిగా (అమికస్‌క్యూరీ) సీనియర్ న్యాయవాది విశ్వనాథన్ వ్యవహరిస్తున్నారు.
విస్తృతమైన అంశం
ఈ కేసు ఒక నిర్దిష్ట ప్రభుత్వానికో, లేక నిర్దిష్ట అధికారికో సంబంధించింది కాదని, అయితే.. దర్యాప్తు సంస్థలు ఎలా ప్రభావితం కాకూడదో, స్వతంత్రంగా తమ దర్యాప్తును ఎలా కొనసాగిస్తాయో అనే విస్తృత అంశానికి సంబంధించినదని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సంజయ్ కరోల్‌తో కూడిన ధర్మాసనానికి చెప్పారు.
అధికారాలు దుర్వినియోగం కావొద్దు
‘పదవీకాలం పొడిగించడం అనేది అభిమానం చాటుకోవడానికి దారి తీస్తుంది. తమ పదవీకాలం ముగిసే సమయంలో దాని పొడిగింపునకు ఎవరూ రాజీపడకూడదు’ అని విశ్వనాథన్ అభిప్రాయపడ్డారు. ‘ఇది ఒక అధికారి గురించో, ప్రభుత్వం గురించో కాదు. ఈ రోజు అధికారంలో ఉన్న ప్రభుత్వం రేపు ప్రతిపక్షంలో ఉండొచ్చు. కానీ.. ఈ అంశాన్ని (పదవీకాలాలు పొడిగించడం) ఏ ప్రభుత్వం కూడా దుర్వినియోగం చేయకూడదు’ అని ఆయన అన్నారు.
పదవీకాలం పొడిగింపు చట్టంవ్యతిరేకం
ఈడీ చీఫ్‌గా మిశ్రా పదవీకాలం పొడిగింపు చట్ట వ్యతిరేకమని గత నెలలోనే విశ్వనాథన్ కోర్టుకు చెప్పారు. అయితే.. ప్రతిపక్ష పార్టీ సభ్యుల అనుబంధం లేదా జోక్యం చేసుకునేందుకు వారికి ఉన్న అర్హతలతో తమకు సంబంధం లేదని, కేసు యోగ్యత, చట్టం ప్రకారమే వ్యవహరిస్తామని సుప్రీం కోర్టు అదే రోజు మౌఖికంగా పేర్కొన్నది. అంతకు ముందు సొలిసిటర్ జనరల్ (Solicitor General) తుషార్ మెహతా తన వాదనలు వినిపిస్తూ ఈడీ చీఫ్ పదవీకాలం పొడిగింపుతో పిటిషనర్లు ఏమీ ప్రభావితం కావడం లేదని, కనుక వారు ఈడీ చీఫ్ పదవీకాలం పొడిగింపును సవాలు చేయజాలరని అన్నారు.
2018 నుంచి ఆయనే
1984 బ్యాచ్‌కు చెందిన ఐఆర్ఎస్ అధికారి సంజయ్ కుమార్ మిశ్రా 2018 నవంబర్ 19న ఈడీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయన పదవీకాలం బాధ్యతలు చేపట్టిన రెండేండ్ల వరకు ఉంటుందని తొలుత నియామక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తర్వాత 2020 నవంబర్ 13న ఆయన పదవీకాలం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అందులో పదవీకాలాన్ని మూడేండ్లు పొడిగిస్తున్నట్టు పేర్కొన్నారు. అనంతరం మరో ఏడాది మూడోసారి పొడిగించారు. దీని ప్రకారం ఆయన 2023 నవంబర్ 18 వరకు ఈడీ చీఫ్‌గా కొనసాగుతారు.