MUNUGODE: ఓట్ల కోసం పార్టీల ఫీట్లు.. అసత్య ప్రచారాలు
ఉన్నమాట: ఎన్నికల ప్రచారంలో భావోద్వేగాలను రెచ్చగొట్టడం, ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించడం బీజేపీకి మొదటి నుంచి అలవాటే. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి పోలింగ్ తేదీ వరకు రకరకాల ప్లాన్లను ఆ పార్టీ అమలు చేస్తూ ఉంటుంది. అది ఇప్పటి ఎలక్షన్ల తీరుకు అద్దం పడుతుంది. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం పోటీ చేసే అభ్యర్థి ఓటర్ల సానుభూతి కోసం కాళ్లకు, చేతులకు కట్టు కట్టుకోవడం మొదలు ఓట్ల కోసం మతపరమైన […]

ఉన్నమాట: ఎన్నికల ప్రచారంలో భావోద్వేగాలను రెచ్చగొట్టడం, ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించడం బీజేపీకి మొదటి నుంచి అలవాటే. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి పోలింగ్ తేదీ వరకు రకరకాల ప్లాన్లను ఆ పార్టీ అమలు చేస్తూ ఉంటుంది. అది ఇప్పటి ఎలక్షన్ల తీరుకు అద్దం పడుతుంది.
పోటీ చేసే అభ్యర్థి ఓటర్ల సానుభూతి కోసం కాళ్లకు, చేతులకు కట్టు కట్టుకోవడం మొదలు ఓట్ల కోసం మతపరమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇవేవీ తమను గట్టెక్కించలేవని తెలిస్తే దాడులు చేయడం, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం ఆ పార్టీకి అలవాటే అని వివపక్షాలు ఆరోపిస్తున్నాయి.
దుబ్బాక తరహాలోనే మునుగోడులో ఫేక్ పార్టీ (బీజేపీ) సోషల్ మీడియాలో బరితెగించింది.
కాంగ్రెస్ అభ్యర్థి, మునుగోడు ఆడబిడ్డ స్రవంతిపై మార్పింగ్ ఫోటోలతో దుష్ఫ్రచారం చేస్తోంది. తమ ఓటమి ఖాయం అన్న భయం ఉన్న వాళ్లే ఇలాంటి నీచానికి దిగజారుతారు#ManaMunugodeManaCongress #MunugodeWithCongress
— Revanth Reddy (@revanth_anumula) November 3, 2022
మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి బీజేపీ ప్రచారం చూసినా, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి వ్యవహార శైలి చూసినా, ఆ పార్టీ నేతలకు ప్రజల నుంచి ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక వారు చేసిన ఎదురుదాడి చూసినా ఇవన్నీ కావాలనే చేసినట్లు మనకు అర్థమౌతుందని టీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
పువ్వు + కారు = పుకారు
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!కాంగ్రెస్ పైన దుబ్బాకలో ఎన్నిక రోజు బీజేపీ టీఆర్‌ఎస్ చేసిన ఫేక్ ప్రచారమే ఈరోజు మునుగోడు లో చేస్తున్నారు, మునుగోడు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అమ్ముడు పోయిందని BJP దుర్మార్గమైన విష ప్రచారాన్ని తిప్పికొట్టండని మునుగోడు ఓటరు మహాశయులకు విజ్ఞప్తి