ఫుట్ బాల్ మ్యాచ్‌లో తొక్కిసలాట.. 127 మంది మృతి
విధాత : గేమ్‌లో గెలుపోటములు సహజం. ఓడిపోయిన జట్టు కొంచెం నిరాశ, నిస్పృహలతో ఉంటుంది. అభిమానులు సైతం ఆందోళనకు గురవుతారు. అయితే ఫుట్ బాల్ మ్యాచ్‌లో ఓటమి పాలైన వర్గం.. గెలుపొందిన వర్గంతో ఘర్షణకు దిగింది. ఈ ఘర్షణల కారణంగా తొక్కిసలాట జరిగి.. 127 మంది మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. ఇండోనేషియా ఈస్ట్ జావాలోని ఓ స్టేడియంలో ఫుట్ బాల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆరెమా ఎఫ్‌సీ, పర్సేబయా సురబయా జట్లు తలపడ్డాయి. ఆరెమా […]

విధాత : గేమ్‌లో గెలుపోటములు సహజం. ఓడిపోయిన జట్టు కొంచెం నిరాశ, నిస్పృహలతో ఉంటుంది. అభిమానులు సైతం ఆందోళనకు గురవుతారు. అయితే ఫుట్ బాల్ మ్యాచ్‌లో ఓటమి పాలైన వర్గం.. గెలుపొందిన వర్గంతో ఘర్షణకు దిగింది. ఈ ఘర్షణల కారణంగా తొక్కిసలాట జరిగి.. 127 మంది మృతి చెందారు.
వివరాల్లోకి వెళ్తే.. ఇండోనేషియా ఈస్ట్ జావాలోని ఓ స్టేడియంలో ఫుట్ బాల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆరెమా ఎఫ్‌సీ, పర్సేబయా సురబయా జట్లు తలపడ్డాయి. ఆరెమా జట్టు ఓడిపోయిది. దీంతో ఆరెమా జట్టు అభిమానులు కోపంతో ఊగిపోయారు. ఇంకేముంది గెలిచిన జట్టు అభిమానులపై దాడులకు దిగారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో తొక్కిసలాట జరిగి 127 మంది దుర్మరణం చెందారు. మరో 180 మంది గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. ఈ ఘర్షణపై ఫుట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండోనేషియా విచారణకు ఆదేశించింది.