Jagtial | ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు ఆపండి.. క‌లెక్ట‌ర్‌కు రైతుల విన‌తి

Jagtial హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు జారీ న్యాయం కోసం కలెక్టర్‌కు మెట్ల చిట్టాపూర్ రైతుల వినతి విధాత బ్యూరో, కరీంనగర్: జగిత్యాల జిల్లా మెటుపల్లి మండలం మెట్ల చిట్టాపూర్ రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. ఇథనాల్ ఫ్యాక్టరీ, పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల పనులు ఆపాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హై కోర్టు స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రతుల ఆధారంగా పనులు నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ జనసమితి రైతు విభాగం రాష్ట్ర […]

Jagtial | ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు ఆపండి.. క‌లెక్ట‌ర్‌కు రైతుల విన‌తి

Jagtial

  • హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు జారీ
  • న్యాయం కోసం కలెక్టర్‌కు మెట్ల చిట్టాపూర్ రైతుల వినతి

విధాత బ్యూరో, కరీంనగర్: జగిత్యాల జిల్లా మెటుపల్లి మండలం మెట్ల చిట్టాపూర్ రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. ఇథనాల్ ఫ్యాక్టరీ, పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల పనులు ఆపాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హై కోర్టు స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఆదేశాల ప్రతుల ఆధారంగా పనులు నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ జనసమితి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు, కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి కంతి మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విజ్ఞాపన పత్రం అందజేశారు.

మెట్ల చిట్టపూర్ శివారులోని సర్వే నంబరు 498, 506 లో ఆ ప్రాంత నిరుపేద రైతులకు గత ప్రభుత్వాల హయాంలో భూ పట్టాలు పంపిణీ చేశారు. ఆనాటి నుంచి నేటి వరకు ఆ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు తెలియకుండానే అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ, పుడ్ ప్రోసెసింగ్ పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నాలు ఆరంభించింది.

రైతులకు పంచిన భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు యత్నించింది. దీంతో ఆప్రాంత నిరుపేద రైతులు ఉన్న కొద్దిపాటి భూములను కోల్పోతున్నామని, తమను ఆదుకోవాలని కొంత కాలంగా న్యాయ పోరాటం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించలేదు. దీంతో 25 భూ నిర్వాసిత కుటుంబాల రైతులు హై కోర్టును ఆశ్రయించారు.

ఈమేరకు స్టేటస్ కో ఉత్తర్వులిచ్చింది. తదుపరి తీర్పు ఇచ్చేంత వరకు అక్కడ ఎలాంటి ఫ్యాక్టరీ నిర్మాణం, భూ సేకరణ పనులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రతులను జగిత్యాల కలెక్టర్ కార్యాలయంలో మెట్ల చిట్టాపూర్ గ్రామ రైతులు అందజేశారు. బాధిత రైతులు న్యాయం చేయాలని కోరారు.

ఈకార్యక్రమంలో తెలంగాణ జన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకుంట శంకర్, యువజన సమితి జిల్లా అధ్యక్షులు కంతి రమేష్, విద్యార్థి జనసమితి రాష్ట్ర కార్యదర్శి తరుణ్, జేఏసీ నాయకులు చింతకుంట దేవేందర్, పులి సంజీవ్, ఒడ్డన్న, గొర్రె భీమన్న, మెంగ సంజీవ్, నర్సయ్య, మహిళా రైతులు, బాధిత రైతులు పాల్గొన్నారు.